OnePlus Nord CE 5G: అప్ కమింగ్ ఫోన్ డిజైన్ అదిరింది

Updated on 03-Jun-2021
HIGHLIGHTS

OnePlus Nord CE 5G ప్రత్యేకతలను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తోంది

ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రత్యేకతలను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తోంది

వన్ ప్లస్ తన OnePlus Nord CE 5G ను జూన్ 10 న లాంచ్ చేస్తోంది

వన్ ప్లస్ తన OnePlus Nord CE 5G ను జూన్ 10 న లాంచ్ చేస్తోంది. OnePlus Nord CE 5G లాంచ్ కోసం ఆన్లైన్లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుంది. ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రత్యేకతలను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇవ్వనున్న 4 మిస్టరీయస్ ఫీచర్లను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తోంది. వీటిలో రెండు ఫీచర్లను ఇప్పటికే రివీల్ చేసింది.

ఇండియాలో ఇప్పటికే OnePlus Nord ని మంచి ఫీచర్లతో తక్కువ ధరలో అందించిన వన్ ప్లస్, ఈ కొత్త OnePlus Nord CE 5G స్మార్ట్ ఫోన్ ను ఎటువంటి ఫీచర్లతో తీసుకువస్తుందో చూడాలి. రివీల్ చేసిన వివరాల ప్రకారం, ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ చాలా సన్నని డిజైన్ తో ఉన్నట్లు చెబుతోంది. అంతేకాదు, కొత్త స్లీక్ మరియు స్ట్రీమ్ లైన్డ్ డిజైన్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు వివరించింది.     

ఇక మిగిలిన రెండు మిస్టీరియస్ ఫీచర్లను జూన్ 4 మరియు జూన్ 8 న రివీల్ చేస్తున్నట్లు డేట్స్ ప్రకటించింది. అలాగే, OnePlus Nord CE 5G స్మార్ట్ ఫోన్ ను జూన్ 11 న ప్రీ ఆర్డర్ చేసే వారికి రూ. 2,699 రూపాయల విలువ గల గిఫ్ట్స్ ని కూడా ఇవ్వనున్నట్లు అఫర్ చేస్తోంది.  వన్ ప్లస్ అదే రోజు ఒక కొత్త స్మార్ట్ టీవీ ని కూడా విడుదల చేయబోతోంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :