OnePlus Nord 5 sale started with huge discount offer
OnePlus Nord 5 : వన్ ప్లస్ నార్డ్ 5 స్మార్ట్ ఫోన్ నిన్ననే మార్కెట్లో లాంచ్ అయ్యింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా వచ్చింది. జస్ట్ సేల్ కి రావడం కాదు ఈ ఫోన్ భారీ ఆఫర్స్ తో ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా వచ్చింది. వన్ ప్లస్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వన్ నార్డ్ 5 స్లే ఆఫర్లు మరియు ఫోన్ ఫీచర్లు తెలుసుకోండి.
వన్ ప్లస్ ఈ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ మూడు వేరియంట్ ప్రైస్ ఈ క్రింద చూడవచ్చు.
వన్ ప్లస్ నార్డ్ 5 (8 జీబీ + 256 జీబీ) వేరియంట్ ప్రైస్ : రూ. 31,999
వన్ ప్లస్ నార్డ్ 5 (12 జీబీ + 256 జీబీ) వేరియంట్ ప్రైస్ : రూ. 34,999
వన్ ప్లస్ నార్డ్ 5 (12 జీబీ + 512 జీబీ) వేరియంట్ ప్రైస్ : రూ. 37,999
ఈ ఫోన్ రోజు నుంచి అమెజాన్ మరియు వన్ ప్లస్ అఫీషియల్ సేల్ నుంచి సేల్ అవుతోంది.
ఈ ఫోన్ పై రూ. 2,250 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని వన్ ప్లస్ ప్రకటించింది. ఈ ఫోన్ ను ICICI మరియు RBL క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో తీసుకునే వారికి ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ ఫోన్ రూ . 29,749 రూపాయల ప్రారంభ ప్రైస్ ట్యాగ్ తో లభిస్తుంది.
ఈ వన్ ప్లస్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8s Gen 3 ఆక్టాకోర్ చిప్ సెట్ జతగా 12 జీబీ LPDDR5X ర్యామ్ సపోర్ట్ తో లాంచ్ వచ్చింది మరియు ఈ ఫోన్ లో 512 జీబీ హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ గేమింగ్ కోసం గొప్పగా ఉంటుంది మరియు దీనికి అవసరమైన 144hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.83 ఇంచ్ AMOLED స్క్రీన్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ కంటెంట్ కోసం కూడా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే, ఈ ఫోన్ స్క్రీన్ 1.5K రిజల్యూషన్ 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు HDR 10+ సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ కెమెరా పరంగా కూడా గొప్ప ఫీచర్స్ మరియు స్పెక్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP Sony IMX906 మెయిన్ సెన్సార్ మరియు 8MP అల్ట్రా డ్యూయల్ రియర్ మరియు ముందు 50 JN5 సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 60FPS తో స్టేబుల్ 4K వీడియో లను రికార్డ్ చేసే సత్తా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో అనేకమైన లేటెస్ట్ AI కెమెరా ఫీచర్లు మరియు వన్ ప్లస్ కెమెరా ఫిల్టర్స్ కూడా ఉన్నాయి.
Also Read: Moto G96 5G: బడ్జెట్ యూజర్ మనసు దోచుకునే ప్రైస్ అండ్ ఫీచర్స్ తో వచ్చేసింది.!
ఈ ఫోన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ Bluetooth 5.4, aptX, aptX HD, LDAC, AAC, SBC, LHDC 5.0 ఫీచర్స్ తో పాటు NFC ఎనేబుల్ తో వస్తుంది. ఇందులో నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఈ వన్ ప్లస్ ఫోన్ 80W SUPERVOOC సపోర్ట్ కలిగిన 6800 mah బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది.