OnePlus Nord 5 launching with smooth display and powerful battery
OnePlus Nord 5: వన్ ప్లస్ నార్డ్ సిరీస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ నార్డ్ 5 మరియు నార్డ్ CE5 లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ రెండు ఫోన్స్ లో వన్ ప్లస్ నార్డ్ 5 కీలక ఫీచర్స్ కూడా వన్ ప్లస్ వెల్లడించింది. స్మూత్ డిస్ప్లే మరియు పవర్ ఫుల్ చిప్సెట్ వంటి మరిన్ని ఫీచర్స్ తో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ ఆటపట్టిస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఎటువంటి ఫీచర్స్ తో రాబోతోందో తెలుసుకోండి.
వన్ ప్లస్ నార్డ్ 5 మరియు CE5 రెండు స్మార్ట్ ఫోన్ లను కూడా జూలై 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ చేసినట్టు అనౌన్స్ చేసింది. ఈ రెండు ఫోన్స్ డిజైన్ మరియు కీలక ఫీచర్స్ తో అమెజాన్ ద్వారా టీజింగ్ మొదలు పెట్టింది. అంటే, ఈ ఫోన్స్ కోసం అమెజాన్ ఇండియా ను ఆన్లైన్ సేల్ పార్ట్నర్ గా ప్రకటించింది.
వన్ ప్లస్ నార్డ్ 5 స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ చాలా స్లీక్ మరియు ప్రీమియం డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు అర్థం అవుతుంది. ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ సింపుల్ అండ్ క్లీన్ డిజైన్ తో లాంచ్ అవుతున్నట్లు టీజర్ ఇమేజస్ ద్వారా అర్థం అవుతుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను వన్ ప్లస్ Ai సపోర్ట్ తో లాంచ్ చేస్తున్నట్లు కూడా వన్ ప్లస్ ప్రకటించింది.
వన్ ప్లస్ నార్డ్ 5 స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8s Gen 3 చిప్ సెట్ తో లాంచ్ అవుతోంది. ఈ చిప్ సెట్ 15 లక్షలకు పైగా AnTuTu స్కోర్ అందించగలిగే పావుర ఫుల్ చిప్ సెట్. ఇది AI సపోర్ట్ తో మరింత వేగంగా ఉంటుంది గొప్ప పెర్ఫార్మెన్స్ అందించే సత్తా కలిగి ఉంటుంది.
అలాగే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే గురించి కూడా కంపెనీ వివరాలు వెల్లడించింది. వన్ ప్లస్ నార్డ్ 5 స్మార్ట్ ఫోన్ లో 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన స్మూత్ డిస్ప్లే ఉందని వన్ ప్లస్ కన్ఫర్మ్ చేసింది. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ( BGMI ) మరియు కాల్ ఆఫ్ డ్యూటీ : మొబైల్ (CODM) గేమ్స్ ఈ ఫోన్ చాలా స్మూత్ మరియు నిలకడగా కొనసాగుతాయని వన్ ప్లస్ గొప్పగా చెబుతోంది.
Also Read: Poco F7 5G: లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ విడుదల చేసిన పోకో.!
వన్ ప్లస్ నార్డ్ 5 స్మార్ట్ ఫోన్ త్వరగా వేడెక్కకుండా మంచి కూలింగ్ నిర్వహణ అందించే పెద్ద వేపర్ ఛాంబర్ కూలింగ్ సపోర్ట్ అందించినట్లు కూడా వన్ ప్లస్ వెల్లడించింది. కెమెరా సెటప్ వివరాలు కూడా ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా వెల్లడయ్యాయి. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్ మరిన్ని అప్డేట్స్ కూడా వన్ ప్లస్ త్వరలోనే అందించే అవకాశం వుంది.