Oneplus Freedom Sale announced in India and offers big deals on oneplus 13
OnePlus Freedom Sale: 2026 రిపబ్లిక్ డే సందర్భంగా ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్, ఫ్రీడమ్ సేల్ 2026 అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుంచి వన్ ప్లస్ 15 మరియు వన్ ప్లస్ 13 పై భారీ డిస్కౌంట్ కూడా అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుంచి వన్ ప్లస్ 15 సిరీస్ మరియు వన్ ప్లస్ 13 సిరీస్ నుంచి అందించిన మరిన్ని ఫోన్స్ పై కూడా గొప్ప డిస్కౌంట్ అందుకోవచ్చని వన్ ప్లస్ తెలిపింది.
వన్ ప్లస్ ఫ్రీడమ్ సేల్ జనవరి 16వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. వన్ ప్లస్ అఫిషియల్ వెబ్‌సైట్, వన్ ప్లస్ ఎక్స్ పీరియన్స్ స్టోర్స్ మరియు అమెజాన్ తో పాటు అన్ని ప్రధాన స్టోర్స్ లో ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ ద్వారా వన్ ప్లస్ డివైజెస్ మంచి ఆఫర్ ధరలో లభిస్తాయి కూడా వన్ ప్లస్ తెలిపింది. ముఖ్యంగా, వన్ ప్లస్ 15 మరియు వన్ ప్లస్ 13 ఫోన్స్ పై భారీ డిస్కౌంట్ అందుకోవచ్చని చెబుతోంది.
వన్ ప్లస్ 15 స్మార్ట్ ఫోన్ అప్ కమింగ్ వన్ ప్లస్ ఫ్రీడమ్ సేల్ నుంచి గొప్ప డీల్స్ తో లభిస్తుంది. ఈ సేల్ నుంచి ఈ ఫోన్ పై రూ. 4,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ తో రూ. 72,999 ధరతో విడుదలైన ఈ ఫోన్ ను రూ. 68,999 ధరలో పొందవచ్చని చెబుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ తో పాటు OnePlus Nord Buds 3 ను ఉచితంగా పొందవచ్చు.
అలాగే, వన్ ప్లస్ 15R ఫోన్ పై కూడా గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ పొందవచ్చు. ఈ ఫోన్ పై అందించిన అన్ని ఆఫర్స్ తో ఈ ఫోన్ వన్ ప్లస్ ఫ్రీడమ్ సేల్ నుంచి కేవలం రూ. 44,999 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.
Also Read: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఎపిక్ డీల్ గా iPhone 15.. ఆల్ టైమ్ చవక ధరలో లభిస్తుంది.!
వన్ ప్లస్ గత సిరీస్ హై ఎండ్ ఫోన్ అవుతుంది మరియు ఈ అప్ కమింగ్ సేల్ నుంచి చాలా గొప్ప డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ పై లాంచ్ ధర రూ. 69,999 ధారగా ఉండగా, ఈ ఫోన్ పై టెంపరరీ ప్రైస్ డ్రాప్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ అందించి సుమారు రూ. 57,999 ఆఫర్ ధరలో అందించబోతున్న టు వన్ ప్లస్ చెబుతోంది.
ఇదే కాదు, వన్ ప్లస్ R ఫోన్ ను రూ. 57,999 ఆఫర్ ధరలో, వన్ ప్లస్ 13s ఫోన్ ను రూ. 49,999 ఆఫర్ ధరలో మరియు వన్ ప్లస్ నార్డ్ 5 స్మార్ట్ ఫోన్ ను రూ. 30,999 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చని వన్ ప్లస్ వెల్లడించింది. ఈ అప్ కమింగ్ సేల్ నుంచి మరిన్ని ప్రొడక్ట్స్ పైన కూడా భారీ డీల్స్ పొందవచ్చు.