OnePlus యూజర్లకు గుడ్ న్యూస్: OxygenOS 16 లాంచ్ అనౌన్స్ చేసిన కంపెనీ.!

Updated on 07-Oct-2025
HIGHLIGHTS

OnePlus యూజర్లకు గుడ్ న్యూస్ అందించింది

OxygenOS 16 స్టేబుల్ అప్డేట్ రిలీజ్ డేట్ ను ఇప్పుడు అందించింది

Intelligently Yours అనే ట్యాగ్‌ లైన్‌ తో OnePlus AI బ్రాండింగ్‌ పరిచయం చేస్తున్నట్లు టీజింగ్ చేస్తోంది

OnePlus యూజర్లకు గుడ్ న్యూస్ అందించింది. ఆండ్రాయిడ్ లేటెస్ట్ గా తీసుకొచ్చిన ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం కోసం వన్ ప్లస్ అందించిన OxygenOS 16 స్టేబుల్ అప్డేట్ రిలీజ్ డేట్ ను ఇప్పుడు అందించింది. ఈ కొత్త మేజర్ అప్డేట్ తో ఈసారి వన్ ప్లస్ తన కొత్త AI సపోర్ట్ ను కూడా పరిచయం చేస్తున్నట్లు తెలిపింది. “Intelligently Yours” అనే ట్యాగ్‌లైన్‌ తో OnePlus AI బ్రాండింగ్‌ను పరిచయం చేస్తున్నట్లు వన్ ప్లస్ టీజింగ్ చేస్తోంది.

OnePlus OxygenOS 16 ఎప్పుడు రిలీజ్ అవుతుంది?

వన్ ప్లస్ అందిస్తున్న ఆక్సిజన్ OS 16 లేటెస్ట్ అప్డేట్ 16 అక్టోబర్ 2025 న రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ డేట్ ని వన్ ప్లస్ తన అధికారిక x అకౌంట్ నుంచి అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. కంపెనీ అకౌంట్ నుంచి చేసిన ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ అప్డేట్ యొక్క బీటా వెర్షన్ ఇప్పటికే అందుబాటులో ఉండగా అఫీషియల్ స్టేబుల్ అప్డేట్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది.

OnePlus OxygenOS 16 ఫీచర్స్ ఏమిటి?

ఈ అప్ కమింగ్ మేజర్ అప్డేట్ ద్వారా ఎటువంటి ఫీచర్స్ అందుతాయి అని వన్ ప్లస్ ఇంకా ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. వన్ ప్లస్ AI ఫీచర్ తో గొప్ప ఎఐ సపోర్ట్ అందిస్తుందని మాత్రం వెల్లడించింది. అయితే, బీటా అప్డేట్ యూజర్లు మరియు లీక్స్ ద్వారా ఈ అప్ కమింగ్ అప్డేట్ గురించి వచ్చిన లీక్స్ ద్వారా ఈ అప్డేట్ అందించే కొన్ని ఫీచర్స్ ఆన్లైన్ లో వెల్లడించారు.

లాక్ స్క్రీన్ విడ్జెట్లు

ఈ కొత్త అప్డేట్ తో కొత్త లాక్ స్క్రీన్ విడ్జెట్ అందిస్తుందని చెబుతున్నారు. ఇందులో వాతావరణం, క్యాలెండర్ వంటి లాక్ స్క్రీన్ విడ్జెట్ ఉంటాయి.

మెరుగైన క్విక్ సెట్టింగ్స్

డ్రాగ్ అండ్ డ్రాప్ టోగుల్, స్క్రోలబుల్ లేఅవుట్, స్ప్లిట్ లేఅవుట్ వంటి వాటితో మరింత మెరుగైన అనుభూతి అందిస్తుందని చెబుతున్నారు.

UI యానిమేషన్ అండ్ మెరుగైన పెర్ఫార్మెన్స్

పూర్తి సిస్టం మొట్ట మెరుగైన యానిమేషన్ మరియు వేగవంతమైన రెస్పాండ్ తో మరింత మెరుగైన పెర్ఫార్మన్స్ అందించే అవకాశం.

కొత్త Dynamic Island ఫీచర్

మొబైల్ ఇండస్ట్రీ కి ఐఫోన్ పరిచయం చేసిన డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఇప్పుడు వన్ ప్లస్ ఫోన్ లలో కూడా పరిచయం చేస్తుంది. ఈ డైనమిక్ ఐల్యాండ్ లో లైవ్ గేమింగ్ స్కోర్, మ్యూజిక్ మరియు నోటి నోటిఫికేషన్ లను కూడా లాక్ స్క్రీన్ పై చూపిస్తుంది.

Also Read: JBL Dolby Soundbar ఫ్లిప్ కార్ట్ సేల్ బిగ్ డిస్కౌంట్ తో 5 వేల బడ్జెట్ ధరలో లభిస్తోంది.!

OnePlus AI

సామర్థ్య వంతమైన వన్ ప్లస్ AI అసిస్టెంట్ తో మరింత గొప్ప పర్సనల్ ఎక్స్పీరియన్స్ ను యూజర్ కి అందించే అవకాశం.

ఈ అప్డేట్ ఏ ఫోన్స్ కి అందిస్తుంది?

వన్ ప్లస్ ఈ అప్ కమింగ్ అప్డేట్ ఫోన్స్ లిస్ట్ ఇంకా విడుదల చేయలేదు. కానీ ఆన్ లైన్ లో లీకైన లిస్ట్ ద్వారా ఈ అప్డేట్ అందుకోనున్న వన్ ప్లస్ ఫోన్స్ లిస్ట్ అందిస్తున్నాము. ఈ అప్డేట్ ముందుగా వన్ ప్లస్ ఫ్లాగ్ షిప్ ఫోన్స్ అయిన వన్ ప్లస్ 13, 12 సిరీస్ మరియు వన్ ప్లస్ 11 సిరీస్ ఫోన్స్ కి అందిస్తుంది. వీటి తర్వాత లేటెస్ట్ వన్ ప్లస్ నార్డ్ 5 సిరీస్ ఫోన్స్ కి అందించే అవకాశం ఉందని చెబుతున్నారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :