OnePlus 9T స్పెక్స్ లీక్: ఫోన్ ఎలా ఉండబోతోందో తెలుసా?

Updated on 02-Jun-2021
HIGHLIGHTS

వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి టీజింగ్

OnePlus 9T లీక్స్ కూడా ఆన్లైన్ వచ్చాయి

OnePlus అప్ కమింగ్ ఫోన్ OnePlus Nord CE లాంచ్ ప్రకటించిన వెంటనే మరొక వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి టీజింగ్ మొదలు పెట్టింది. వన్ ప్లస్ తన నెక్స్ట్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ OnePlus 9T గురించి టీజింగ్ చేస్తోంది. అంతేకాదు, OnePlus 9T యొక్క లీక్స్ కూడా ఆన్లైన్ వచ్చాయి. ఈ లీక్స్ తో OnePlus 9T ఫోన్ ఎలా ఉండబోతోందో అర్ధమవుతోంది.                        

OnePlus 9T: లీకైన స్పెక్స్

OnePlus 9T యొక్క లేటెస్ట్ లీక్ స్పెక్స్ ద్వారా ఈ ఫోన్ లో సరికొత్త Samsung LTPO OLED ఫ్లెక్సీబుల్ డిస్ప్లేని 120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఇది కర్వ్డ్ డిస్ప్లే మరియు FHD+ రిజల్యూషన్ తో ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. ఈ OnePlus 9T స్మార్ట్ ఫోన్ చాలా విభాగాల్లో కొత్త ఫీచర్లను కలిగి ఉంటుందని కూడా ఊహిస్తున్నారు.

ఈ ఫోన్  ప్రాసెసర్ విషయానికి  వస్తే, OnePlus 9T స్మార్ట్ ఫోన్ Snapdragon 888 లేదా Snapdragon 888+ (Pro) చిప్ సెట్ శక్తితో వస్తుందని లేటెస్ట్ లీక్స్ చెబుతున్నాయి. ఈ వేగవంతమైన ప్రాసెసర్ కి జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ఉండవచ్చని కూడా ఈ లేటెస్ట్ లీక్స్ వెల్లడిస్తున్నాయి. ఇవి మాత్రమే కాదు ఈ ఫోన్ వైర్ లెస్ ఛార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుందని ఈ లీక్స్ సూచిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే వన్ ప్లస్ అప్ కమింగ్ ఫోన్ OnePlus 9T భారీ ఫీచర్ల తోనే వచ్చేటట్లు కనిపిస్తోంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :