OnePlus 8 సిరీస్ ఏప్రిల్ 14 వ తేదికి విడుదలకానున్నాయి : 120Hz డిస్ప్లే మరియు 5G సపోర్ట్

OnePlus 8 సిరీస్ ఏప్రిల్ 14 వ తేదికి విడుదలకానున్నాయి : 120Hz డిస్ప్లే మరియు 5G సపోర్ట్
HIGHLIGHTS

ఈ సరికొత్త వన్‌ ప్లస్ సిరీస్ 5 జీ కనెక్టివిటీకి తోడ్పడుతుందని కంపెనీ ధృవీకరించింది.

వన్‌ ప్లస్ 8 స్మార్ట్‌ ఫోన్ సిరీస్ ఏప్రిల్ 14 న అధికారికంగా లాంచ్ అవుతుందని కంపెనీ సోమవారం ప్రకటించింది. అయితే ఇది కేవలం ఆన్‌లైన్ ప్రోగ్రామ్ ద్వారా రాత్రి 8:30 గంటలకు వన్‌ ప్లస్ యొక్క అధికారిక వెబ్‌ సైట్ మరియు యూట్యూబ్ ఛానెల్‌ నుండి ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఈ సరికొత్త వన్‌ ప్లస్ సిరీస్ 5 జీ కనెక్టివిటీకి తోడ్పడుతుందని కంపెనీ ధృవీకరించింది.

ఈ వన్‌ ప్లస్ 8 సిరీస్‌ లో వన్‌ ప్లస్ 8 ప్రో మరియు వన్‌ ప్లస్ 8 ఉన్నాయి, కంపెనీ మునుపటి లాంచ్ ద్వారా అనేక లీకుల ద్వారా వెల్లడించింది. ఈ మొబైల్ ఫోన్ కోసం 120 Hz రిఫ్రెష్ రేట్‌ డిస్ప్లే అని కూడా కంపెనీ టీజ్ చేసింది, అయితే రెండు స్మార్ట్‌ ఫోన్ల లో లేదా కేవలం ప్రో వేరియంట్లలో మాత్రమే లభిస్తుందా అనేది విషయం గోప్యంగా  ఉంది. వన్‌ ప్లస్ ఈ ఏడాది కొత్త సిరీస్‌ లో వన్‌ ప్లస్ మరో స్మార్ట్‌ ఫోన్ను విడుదల చేస్తుందని ఉహించబడింది. అయితే, రానున్న మరోకొన్ని వారాల్లో ఈ చైనా టెక్ దిగ్గజం నుండి మరింత సమాచారం రావచ్చని ఆశిస్తున్నారు.

వన్‌ ప్లస్ వెబ్‌ సైట్‌ లో పోస్ట్ చేసిన అధికారిక టీజర్ నుండి, ఈ స్మార్ట్‌ ఫోన్ యొక్క బ్లాక్ కలర్ వేరియంట్‌ ను మనం చూడవచ్చు. కెమెరా స్పెసిఫికేషన్లు లేదా ధరలు వంటి చాలా వివరాలు ఇంకా వెల్లడించలేదు. అయితే, గత ఒక నెలలో వచ్చిన లీక్‌ ల కారణంగా, రాబోయే వన్‌ప్లస్ 8 మరియు వన్‌ప్లస్ 8 ప్రో స్మార్ట్‌ ఫోన్లలో రానున్న చాలా ఫీచర్లను చూడవచ్చు. ఇందులో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ మరియు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 SoC వంటివి ఉన్నాయి.

ముఖ్యంగా, విన్ ఫ్యూచర్ వెబ్‌ సైట్ రాబోయే వన్‌ ప్లస్ 8 యొక్క రెండర్‌ లను షేర్ చేసింది మరియు ఈ పోస్ట్ నుండి కొత్త సమాచారం వచ్చింది. ఇవే కాకుండా, టిప్‌ స్టర్ ఇషాన్ అగర్వాల్ కూడా తన ట్వీట్ ద్వారా కలర్ ఆప్షన్ గురించి సమాచారాన్ని అందించారు. మూడు రంగులలో గ్లేసియర్ గ్రీన్, ఒనిక్స్ బ్లాక్ మరియు ఇంటర్స్టెల్లార్ గ్లో ఉన్నాయి. గ్రీన్ వేరియంట్ ఇటీవల వన్‌ ప్లస్ 8 ప్రో యొక్క నమూనాలో కనిపించగా, ఒనిక్స్ కలర్ వన్‌ ప్లస్ ఎక్స్‌లో కనిపించింది. ఈ వన్‌ప్లస్ కుటుంబంలో ఇంటర్‌స్టెల్లార్ గ్లో కొత్త రంగు అదనంగా ఉంటుంది.

వన్‌ ప్లస్ 8 లో ఒక 6.55-అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లే ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేటుతో రాబోతుంది, అయితే ప్రో వెర్షన్ 120Hz రిఫ్రెష్ రేట్ పొందబోతోంది. ఇది కాకుండా, ఫోన్ స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌ సెట్‌ తో పనిచేస్తుంది మరియు 8GB / 12GB LPDDR4X RAM తో జతచేయబడుతుంది మరియు ఫోన్‌కు 128GB / 256GB UFS 3.0 స్టోరేజ్ లభిస్తుంది.

ఆప్టిక్స్ గురించి చూస్తే, ఈ ఫోనుకు 48 ఎంపి + 16 ఎంపి + 2 ఎంపి మూడు కెమెరాలతో ట్రిపుల్ రియర్ కెమెరా లభిస్తుంది మరియు సెల్ఫీ కోసం ఫోనులో 16 ఎంపి ఫ్రంట్ కెమెరా అందించబడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ 4300 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి, ఒక 30W ఫాస్ట్ ఛార్జింగుకు మద్దతు ఇస్తుంది. మునుపటి లీక్‌ల ప్రకారం, ఫోనులో IP రేటింగ్ లేదా వైర్‌లెస్ ఛార్జింగ్ కనిపించలేదు. ఈ ఫోన్ గ్లో, బ్లాక్ మరియు గ్రీన్ రంగులలో వస్తుంది. వన్‌ ప్లస్ 8 ప్రో లో ఒక 6.78-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంది, ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోనుకు స్నాప్‌డ్రాగన్ 865 SoC శక్తినివ్వనుంది. ఇది కాకుండా, ఫోన్ 8GB / 12GB LPDDR5 RAM మరియు 128GB / 256GB UFS 3.0 స్టోరేజీతో రావచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo