OnePlus 7 Pro అదిరిపోయే ఫీచర్లతో విడుదలయ్యింది.
ఎన్నో రూమర్లు, అంచనాలు మరియు లీకుల తరువాత, ఎట్టకేలకు Oneplus 7 సిరీస్ స్మార్ట్ ఫోన్లను ఇండియాలో విడుదల చేసింది. అయితే, ఇందులో అద్భుతమైన ఫీచర్లతో మరియు అందరిని ఆశ్చర్యపరిచే డిజైనుతో OnePlus 7 Pro స్మార్ట్ ఫోన్ను తీసుకువచ్చింది. ముందుగా, ఊహించినట్లే ఈ స్మార్ట్ ఫోన్ను ఒక స్నాప్ డ్రాగన్ 855 SoC తో తీసుకొచ్చింది మరియు ఇది 7nm చిప్సెట్ కావడంతో అత్యంతవేగంగా పనిచేస్తుంది. ఈ వేగవంతమైన ప్రాసెసరుకు జతగా, 6GB/8GB/12GB ర్యామ్ ఎంపికలతో తీసుకొచ్చింది.
SurveyOnePlus 7 Pro ధర
OnePlus 7 Pro – 6GB + 128GB – Rs. 48,999
OnePlus 7 Pro – 8GB + 256GB – Rs. 52,999
OnePlus 7 Pro – 12GB + 256GB – Rs. 57,999
OnePlus 7 Pro ప్రత్యేకతలు
ఈ స్మార్ట్ ఫోన్ 3120 x 1440 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందిచగల ఒక 6.67 అంగుళాల QHD + ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో అందించింది. ఈ డిస్ప్లేలో ఎటువంటి నోచ్ లేకుండా పూర్తి స్క్రీన్ అందించింది మరియు ఒక 19.5:9 ఆస్పెక్ట్ రేషియాతో వస్తుంది. ఈ ఫోన్ ఇండియాలో మొదటిసారిగా అత్యంత వేగవంతమైన క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 855 ఆక్టా కోర్ 7nm ప్రాసెస్సరుతో తీసుకొచ్చింది. ఈ వేగవంతమైన ప్రాసెసరుకు జతగా, 6GB/8GB/12GB ర్యామ్ ఎంపికలతో తీసుకొచ్చింది. ఈ ఫోన్ యొక్క డిస్ప్లేలో ఒక అంతర్గత ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కూడా అందించింది. కేవలం వేగం ఒక్కటే కాకుండా, స్టైల్ మరియు ట్రెండ్ రెండింటిని జత చేసినట్లు చెప్పొచ్చు.
ఇక కెమేరా విభాగానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క వెనుక భాగంలో f/1.6 అపర్చరు కలిగిన 48MP SonyIMX586 సెన్సర్ ని ప్రధాన కెమెరాగా అందించింది. దీనికి జతగా మరొక f/2.2 అపర్చరు కలిగిన 16MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమేరా మరియు f/2.4 అపర్చరు కలిగిన 8MP కెమేరాలను కలిపి ఒక ట్రిపుల్ రియర్ కెమేరాగా అందించింది. ఈ కెమేరాతో 4K రిజల్యూషన్ తో 30/60fps వద్ద వీడియోలను తీసుకోవచ్చు. ఇక సెల్ఫీ కెమేరా విషయానికి వస్తే, ఇందులో పాప్ అప్ సెల్ఫీ కెమేరాని తీసుకొచ్చింది వన్ ప్లస్ సంస్థ, ఇది ఒక SonyIMX 471 సెన్సార్ గల 16MP కెమేరాని అందించి. ఈ ఫోనులో రియర్ కెమెరాతో 3X ఆప్టికల్ జూ కూడా చేసుకోవచ్చు.
OnePlus 7 Pro లాంచ్ ఆఫర్లు
OnePlus 7 ప్రో స్మార్ట్ ఫోనుతో పాటుగా జియో యొక్క 9300 రూపాయల బెనిఫిట్స్ అందుకోవచ్చు. ఇక బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే, SBI కార్డుతో ఈ ఫోన్ను కొనుగోలు చేసేవారికి 2,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే, 6 నెలల EMI ఎంపికతో కొనుగోలు చేసేవారికి ఎటువంటి వడ్డీ లేకుండా No Cost EMI ని కూడా అందిస్తోంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
