మొదలైన OnePlus 7 Series ప్రీ బుకింగ్స్
మే 3 వ తేదీ నుండి మే 7 వ తేదీ మధ్యకాలంలో వన్ ప్లస్ 7 గిఫ్ట్ కార్డును 1,000 ధరతో కొనుగోలు చేయడంతో, 15,000 రూపాయల విలువగల 6 నెలల యాక్సిడెంటల్ స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫరును కూడా పొందవచ్చు.
ప్రతిష్ఠాత్మకంగా, మే 14 వ తేదీన విడుదల చేయనున్న వన్ ప్లస్ 7 సిరీస్ ఫోన్ల యొక్క ప్రీ బుకింగ్స్, ఇప్పటికే అమేజాన్ ఇండియా నుండి మొదలయ్యాయి. ఇందులో, ఇప్పటి వరకు అత్యుత్తమైన ప్రాసెసర్ గా పేరుగాంచిన, క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ కి జతగా ఒక 12GB ర్యామ్ తో వన్ ప్లస్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ను విడుదల చేయనున్నట్లు వస్తున్న నివేదికల వలన, అందరూ కూడా ఈ స్మార్ట్ ఫోన్లా పైన గొప్ప అంచనాలను వేస్తున్నారు. అధనంగా, మే 3 వ తేదీ నుండి మే 7 వ తేదీ మధ్యకాలంలో వన్ ప్లస్ 7 గిఫ్ట్ కార్డును 1,000 ధరతో కొనుగోలు చేయడంతో, 15,000 రూపాయల విలువగల 6 నెలల యాక్సిడెంటల్ స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫరును కూడా పొందవచ్చు.
OnePlus 7 మరియు OnePlus 7 Pro ప్రత్యేకతలు
వన్ ప్లస్ 7 ఫోన్ ఒక 6.4 అంగుళాల ఫ్లాట్ OLED డిస్ప్లేతో ఉంటే, OnePlus 7 Pro ఒక 6.7 అంగుళాల కర్వ్డ్ QHD+ సూపర్ AMOLED డిస్ప్లేతో రానుంది.ఈ రెదను స్మార్ట్ ఫోన్లు కూడా ఒక స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసరుతో తీసుకురావచ్చు. అయితే, వన్ ప్లస్ 7 ప్రో లో మాత్రం 5G కనెక్టవిటీ కోసం X50 మోడెమ్ తో అందించవచ్చు.
ఇక కెమేరా విభాగానికి వస్తే, OnePlus 7 Pro ఒక ట్రిపుల్ రియార్ కెమేరాతో తీసుకొస్తుంది. ఈ కెమేరా 3X జూమ్ తో రానుంది మరియు ఇందులో ఒక 48MP ప్రధాన కెమేరా f/1.6 అపర్చరుతో ఉంటుంది . దీనికి జతగా 3X జూమ్ చేయగల ఒక f/2.4 అపర్చరు గల 8MP టెలిఫోటో లెన్స్ మరియు ఒక 16MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమేరా లు ఉంటాయి. ఇక OnePlus 7 విషయానికి వస్తే, ఇది f/1.7 అపర్చరు గల ఒక 48MP ప్రధాన కెమేరాకి జతగా ఒక 5MP డెప్త్ సెన్సార్ తో కూడిన డ్యూయల్ రియారా కెమేరా ఉంటుంది.
ఇక బ్యాటరీ సమర్ధయాల విషయానికి వస్తే, వన్ ప్లస్ 7 ప్రో ఒక 4,000 mAh బ్యాటరీతో మరియు 30W Wrap ఛార్జ్ సపోర్టుతో ఉంటే, వన్ ప్లస్ 7 మాత్రం 3,600mAh బ్యాటరీతో 20W స్పీడ్ ఛార్జ్ సపోర్టుతో వస్తాయి.
Geekbench లో OnePlus GM 1917 మోడల్ నంబర్ గల ఒక స్మార్ట్ ఫోన్ 12GB ర్యామ్ తో దర్శనమిచ్చింది. ఇది కచ్చితంగా వన్ ప్లస్ 7 ప్రో స్మార్ట్ అయ్యివుంటుందని తెలుస్తోంది. అలాగే, ఈ ఫోన్ గీక్ బెంచ్ పైన 3551 సింగల్ కోర్ టెస్ట్ స్కోరును మరియు 11012 మల్టీ కోర్ టెస్ట్ స్కోరును సాధించింది. అలాగే, ముందుగా వచ్చిన కొన్ని నివేదికల ప్రకారం, ఈ వన్ ప్లస్ 7 ప్రో 6GB ర్యామ్ జతగా 128GB స్టోరేజి, 8GB ర్యామ్ జతగా 256GB స్టోరేజి మరియు 12GB ర్యామ్ జతగా 256GB స్టోరేజి వంటి మూడు వేరియంట్లలో కూడా రానున్నట్లు తెలుస్తోంది.