OnePlus 15R launching as segment first 4K 120FPS camera phone
OnePlus 15R స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 17న ఇండియాలో లాంచ్ అవవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ కీలక ప్రత్యేకతలు విడుదల చేసింది. కంపెనీ అందించిన ఈ టీజర్ లో ఈ ఫోన్ సెగ్మెంట్ ఫస్ట్ 4K 120FPS పవర్ ఫుల్ కెమెరాతో లాంచ్ అవుతోందని, వన్ ప్లస్ ఈ ఫోన్ గురించి గొప్పగా చెబుతోంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ మరిన్ని గొప్ప ఫీచర్స్ కూడా కలిగి ఉంటుందని వన్ ప్లస్ టీజర్ లో వెల్లడించింది.
వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా అందించింది. ఈ కెమెరాలో అందించిన అందించిన కెమెరా వివరాలు ఇంకా వెల్లడించలేదు కానీ, ఈ ఫోన్ సెగ్మెంట్ ఫస్ట్ 4K 120FPS పవర్ ఫుల్ కెమెరాతో లాంచ్ అవుతుందని తెలిపింది. ఇందులో, 50MP ప్రైమరీ స్పెషల్ సెన్సార్ మరియు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్లు ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది మాత్రమే కాదు ముందు కూడా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన పవర్ ఫుల్ సెల్ఫీ కెమెరా కూడా ఉండే అవకాశం ఉంటుంది.
ఈ ఫోన్ స్లీక్ అండ్ సింపుల్ డిజైన్ తో ఉంటుంది. కానీ ఈ ఫోన్ లో శక్తివంతమైన క్వాల్కమ్ Snapdragon 8 Gen 5 చిప్ సెట్ ఉంటుంది. ఈ ఫోన్ ను మరింత పవర్ ఫుల్ గా మార్చే టచ్ రెస్పాన్స్ చిప్ మరియు నెట్ వర్క్ కోసం G2 WiFi చిప్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 5 చిప్ సెట్ తో వస్తున్న మొదటి ఫోన్ అవుతుంది.
ఈ ఫోన్ లో గొప్ప డిస్ప్లే కూడా ఉంటుంది. వన్ ప్లస్ 15R స్మార్ట్ ఫోన్ ను 165Hz రిఫ్రెష్ రేట్ కలిగిన పవర్ ఫుల్ డిస్ప్లే తో లాంచ్ చేస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ కూడా లైఫ్ టైమ్ డిస్ప్లే వారంటీ ఫీచర్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 7400 mAh బిగ్ అండ్ పవర్ ఫుల్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ వన్ ప్లస్ యొక్క లేటెస్ట్ ఆక్సిజన్ OS 16 పై నడుస్తుంది. ఈ ఫోన్ IP66, IP68, IP69 మరియు IP69K రేటింగ్ తో గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా ఉంటుంది.
Also Read: Redmi Note 15 5G : 4K వీడియో సపోర్ట్ కలిగిన 108MP కెమెరా సెటప్ తో వస్తోంది.!
వన్ ప్లస్ 15R స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 17న ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ తో పాటు వన్ ప్లస్ ప్యాడ్ గో 2 ను కూడా లాంచ్ చేస్తోంది.