OnePlus 15R First Sale started today with big deals
OnePlus 15R First Sale: వన్ ప్లస్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 15R స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అయ్యింది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో పాటు స్టార్ట్ అయ్యింది. ఈ లేటెస్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ గురించి మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే ప్రైస్ మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
వన్ ప్లస్ 15R స్మార్ట్ ఫోన్ రెండు వేరియాయ్న్స్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ రెండు వేరియంట్ ప్రైస్ ఇప్పుడు చూద్దాం.
వన్ ప్లస్ 15R (12 జీబీ + 256 జీబీ) వేరియంట్ ప్రైస్ : రూ. 47,999
వన్ ప్లస్ 15R (12 జీబీ + 512 జీబీ) వేరియంట్ ప్రైస్ : రూ. 52,999
వన్ ప్లస్ 15R 5జి ఫోన్ చార్కోల్ బ్లాక్, ఎలక్ట్రిక్ వయొలెట్ మరియు మింట్ బ్రీజ్ మూడు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
ఈ ఫోన్ పై ఫస్ట్ సేల్ నుంచి భారీ ఆఫర్లు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ పై రూ. 3,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఇది HDFC అండ్ Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ పై వర్తిస్తుంది. మెయిన్ గా ఈ ఫోన్ ను ముందుగా తీసుకునే యూజర్లకు (లిమిటెడ్ స్టాక్ పై) రూ. 2,299 విలువైన వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 3 ఫ్రీ గా ఆఫర్ చేస్తుంది.
Also Read: BSNL Christmas Bonanza: యూజర్లకు గుడ్ న్యూస్ తెలిపిన ప్రభుత్వ టెలికాం.!
ఈ వన్ ప్లస్ లేటెస్ట్ ఫోన్ 1.5K రిజల్యూషన్ కలిగిన 6.83 ఇంచ్ బిగ్ LTPS AMOLED స్క్రీన్ తో వచ్చింది. ఇది గొరిల్లా గ్లాస్ 7i రక్షణతో ఉంటుంది మరియు 60-165Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కూడా కలిగి ఉంటుంది. ఇది క్వాల్కమ్ లేటెస్ట్ చిప్ సెట్ Snapdragon 8 Gen 5 తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 12 జీబీ LPDDR5x ర్యామ్ జతగా 512 జీబీ ఫాస్ట్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఈ వన్ ప్లస్ ఫోన్ ఆక్సిజన్ 16.0 OS తో ఆండ్రాయిడ్ 16 OS పై పని చేస్తుంది.
వన్ ప్లస్ 15R ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో 50MP Sony IMX 906 ప్రధాన కెమెరా జతగా 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటాయి. ఈ ఫోన్ 32MP సెల్ఫీ కెమెరాతో కూడా వస్తుంది. ఈ ఫోన్ కలిగిన రెండు కెమెరాలు కూడా 30FPS 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉన్నాయి. ఇది కాకుండా ఎఐ కెమెరా ఫీచర్స్ మరియు వన్ ప్లస్ కెమెరా ఫిల్టర్లు కూడా కలిగి ఉంటుంది.
ఈ వన్ ప్లస్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ భారీ 7400 mAh బ్యాటరీని 80W సూపర్ ఊక్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. అంతేకాదు, IP66, IP68, IP69 మరియు IP69K సపోర్ట్ తో ఈ ఫోన్ గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా వచ్చింది.