OnePlus 15 Price: ఫోన్ అంచనా ప్రైస్ అండ్ కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.!

Updated on 12-Nov-2025
HIGHLIGHTS

వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 15 రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది

ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ ప్రైస్ గురించి నెట్టింట్లో తెగ వెతికేస్తున్నారు

దీనికి సంబంధించిన లీక్డ్ న్యూస్ లు కూడా ఆన్‌లైన్లో తెగ సర్క్యులేట్ అవుతున్నాయి

OnePlus 15 Price: వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 15 రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది. అయితే, ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ ప్రైస్ గురించి నెట్టింట్లో తెగ వెతికేస్తున్నారు. అంతేకాదు, దీనికి సంబంధించిన లీక్డ్ న్యూస్ లు కూడా ఆన్‌లైన్లో తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ ఫోన్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యాయి సేల్ కూడా నడుస్తుండటం తో ఈఫోన్ ధర అంచనా వేసి చెబుతున్నారు.

OnePlus 15 Price

వన్ ప్లస్ 15 స్మార్ట్ ఫోన్ చైనా ప్రైస్ తో డీకోడ్ చేసి ఇండియా వేరియంట్ అంచనా ధర లెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్ లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం, ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ (12 జీబీ + 256 జీబీ) ను రూ. 76,999 ధరలో లాంచ్ చేసే అవకాశం ఉందని లెక్కలు వేసి చెబుతున్నారు. అంతేకాదు, ఈ ఫోన్ హైఎండ్ (16 జీబీ + 512 జీబీ) ని కూడా లాంచ్ చేసే అవకాశం ఉందని మరియు ఈ వేరియంట్ ను రూ. 76,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ, ఇవి ఆన్లైన్ లో వస్తున్న అంచనా ప్రైస్ మాత్రమే అని గమనించాలి. ఒరిజినల్ ప్రైస్ రేపు ఫోన్ లాంచ్ సమయంలో తెలుస్తుంది.

Also Read: Wobble Smartphone: మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తున్న ఇండియన్ బ్రాండ్.!

OnePlus 15 : ఫీచర్స్

వన్ ప్లస్ 15 స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Elite 5 Gen చిప్ సెట్ తోలాంచ్ అవుతుంది. ఇందులో LPDDR5X ర్యామ్ మరియు UFS 4.1 అల్ట్రా ఫాస్ట్ స్టోరేజ్ ఉంటాయి. ఈ ఫోన్ వన్ ప్లస్ అందించిన కొత్త ఆక్సిజన్ 16 OS జతగా ఆండ్రాయిడ్ 16OS పై నడుస్తుంది. ఇది 165Hz రిఫ్రెష్ రేట్ కలిగిన ప్రీమియం డిస్ప్లే తో లాంచ్ అవుతుంది. ఇది గొప్ప బ్రైట్నెస్, టచ్ రెస్పాన్స్ కోసం ప్రత్యేకమైన చిప్ మరియు గొప్ప విజువల్స్ అందించే HDR సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 మరియు IP69 రేటింగ్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుంది.

ఈ వన్ ప్లస్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వెనుక మూడు 50MP కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టం ఉంటుంది. ఇది 8K మరియు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో సూపర్ రిజల్యూషన్ ఫోటోలు కూడా ఆఫర్ చేస్తుంది (చైనా వేరియంట్ ద్వారా తెలిపాము) అంతేకాదు, ఈ ఫోన్ ప్లస్ మైండ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఎందుకంటే, ఈ ఫోన్ వన్ ప్లస్ బిల్ట్ ఎఐ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ 7300 mAh బిగ్ బ్యాటరీ, 120W అల్ట్రా ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ మరియు 50W ఎయిర్ ఊక్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :