OnePlus 15 India variant complete expected features know here
OnePlus 15: వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 15 లాంచ్ కోసం టీజింగ్ స్టార్ట్ చేసింది. ఈ ఫోన్ ను వన్ ప్లస్ 13s స్మార్ట్ ఫోన్ మాదిరి డిజైన్ తో అందిస్తున్నట్లు ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ చూస్తే అర్ధం అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రోసెసర్ మరియు కెమెరా వివరాలు కూడా వన్ ప్లస్ వెల్లడించింది. అయితే, ఈ ఫోన్ నిన్న చైనా మార్కెట్ లో లాంచ్ అయ్యింది కాబట్టి ఈ ఫోన్ ఇండియా వేరియంట్ అంచనా ఫీచర్స్ మనం ఊహించడం సాధ్యం అవుతుంది.
వన్ ప్లస్ 15 స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ వచ్చే నెల ప్రారంభం లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంటే, నవంబర్ 15వ తేదీ లోపు ఈ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
వన్ ప్లస్ 15 స్మార్ట్ ఫోన్ నిన్న చైనా మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ చైనా వేరియంట్ కలిగిన అదే ఫీచర్స్ తో ఇండియాలో కూడా లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా వేరియంట్ కెమెరా మరియు చిప్ సెట్ వివరాలు కూడా వన్ ప్లస్ టీజర్ ద్వారా ఇప్పటికే వెల్లడించింది. ఈ రెండు ఫీచర్స్ కూడా చైనా వేరియంట్ ను పోలి ఉన్నాయి. అందుకే, ఈ ఫోన్ చైనా లో విడుదలైన ఫోన్ ను పోలిన వివరాలతో వస్తుందని అంచనా వేస్తున్నారు.
వన్ ప్లస్ 15 స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచ్ ఫ్లాట్ LTPO స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ లో అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 165Hz రిఫ్రెష్ రేట్ మరియు 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డాల్బీ విజన్ మరియు HDR 10+ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ Snapdragon 8 Elite Gen 5 చిప్ సెట్ తో పని చేస్తుంది. దీనికి జతగా LPDDR5X ర్యామ్ మరియు UFS 4.1 ఫాస్ట్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టం మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా అందించింది. ఇందులో రియర్ కెమెరా సిస్టంలో 50MP మెయిన్, 50MP మరియు 3.5x పెరిస్కోప్ సెన్సార్లు కలిగి ఉంటాయి. ఈ ఫోన్ మెయిన్ కెమెరా 30FPS 8K వీడియో రికార్డింగ్ మరియు 120FPS వద్ద 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇందులో గుట్టల కొద్దీ కెమెరా ఫీచర్ మరియు ఫిల్టర్లు ఉంటాయి.
Also Read: భారీ బ్యాటరీతో Motorola అప్ కమింగ్ ఫోన్ వస్తోంది.!
ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ 7300 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 120W వస్ట్ వైర్డ్ ఛార్జ్ సపోర్ట్ మరియు 50W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP66, IP68, IP69 రేటింగ్ తో మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది.