OnePlus 15 india launch date and features confirmed
OnePlus 15 స్మార్ట్ ఫోన్ ఈ వారం చైనా మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఈ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ కూడా వన్ ప్లస్ ప్రకటించింది. ఈ కొత్త అప్డేట్ తర్వాత వన్ ప్లస్ 15 స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్ సెట్ తో ఇండియాలో విడుదలయ్యే మొదటి ఫోన్ గా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్లు తెలుసుకుందామా.
వన్ ప్లస్ 15 స్మార్ట్ ఫోన్ నవంబర్ 13వ తేదీ ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ ని నిన్న అధికారిక x అకౌంట్ నుంచి వన్ ప్లస్ ప్రకటించింది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా ద్వారా కూడా టీజింగ్ చేయబడుతోంది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా సేల్ పార్ట్నర్ గా ఉంటుంది కాబట్టి ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన టీజర్ పేజి అందించిన టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ కోసం నుంచి ఈ ఫోన్ యొక్క కీలక ఫీచర్స్ విడుదల చేసింది.
వన్ ప్లస్ 15 స్మార్ట్ ఫోన్ 13s స్మార్ట్ ఫోన్ మాదిరి డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ రౌండ్ కార్నర్ మరియు బిగ్ కెమెరా బంప్ తో ఉంటుంది. ఈ క్వాల్కమ్ Snapdragon 8 Elite Gen 5 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఈ చిప్ సెట్ తో ఇండియాలో విడుదలయ్యే మొదటి ఫోన్ కూడా ఇదే అవుతోంది. ఈ ఫోన్ వన్ ప్లస్ యొక్క లేటెస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ Oxygen OS 16 జతగా ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది. ఈ ఫీచర్స్ ద్వారా ఈ ఫోన్ పూర్తిగా సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో వస్తుందని అర్థమయ్యేలా చేసింది.
ఐకే ఈ ఫోన్ ప్లస్ ఎక్స్పెక్టెడ్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ 50MP కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఇందులో 50MP మెయిన్, 50MP అల్ట్రా వైడ్ మరియు 50MP టెలిస్కోప్ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ లో 1.5K రిజల్యూషన్ కలిగిన 6.78 ఇంచ్ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ 165Hz రిఫ్రెష్ రేట్ మరియు 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.
Also Read: Nothing Phone (3a) Lite సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
వన్ ప్లస్ 15 స్మార్ట్ ఫోన్ 7,300 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో అందించిన బిగ్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 50W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా కూడా ఉంటుంది=ని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ చైనా వేరియంట్ ను బట్టి ఈ ఫీచర్స్ ఉండే అవకాశం ఉంటుందని ఈ అంచనా వేసాము.