OnePlus 10 Pro: భారీ ఫీచర్లతో వచ్చిన వన్ ప్లస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్

Updated on 11-Jan-2022
HIGHLIGHTS

OnePlus 10 Pro ను చైనాలో విడుదల చేసింది

వన్ ప్లస్ 10 ప్రో స్నాప్ డ్రాగన్ 8 Gen1 చిప్ సెట్ తో వచ్చింది

50W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో కలిగివుంది

వన్ ప్లస్ తన ప్రీమియం స్మార్ట్ ఫోన్ OnePlus 10 Pro ను ఎట్టకేలకు చైనాలో విడుదల చేసింది. అయితే, ఈరోజు కేవలం OnePlus 10 Pro ను మాత్రమే విడుదల చేసింది మరియు వన్ ప్లస్ 10 ఊసే లేదు. అయితే, త్వరలోనే వన్ ప్లస్ 10 ను కూడా ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఈ వన్ ప్లస్ 10 ప్రో స్నాప్ డ్రాగన్ 8 Gen1 చిప్ సెట్ మరియు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి భారీ ఫీచర్లతో వచ్చింది.

OnePlus 10 Pro: స్పెక్స్

OnePlus 10 Pro స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ LTPO AMOLED డిస్ప్లే ను కలిగి ఉంటుంది. ఇది QHD+ రిజల్యూషన్, అంటే 3216×1440 పిక్సెల్స్ రిజల్యూషన్ ను అందించడమే కాక 120Hz రిఫ్రెష్ రేట్ కు కూడా మద్దతునిస్తుంది. ఈ ఫోన్ 8.55mm కొలతలతో కొంచెం మందంగా ఉంటుంది మరియు 200 గ్రాముల బరువు ఉంటుంది. ఈ వన్ ప్లస్ ఫోన్ గ్లాస్-మెటల్ బిల్డ్ కలిగి ఉంది మరియు IP68 సర్టిఫికేట్ తో వస్తుంది. అంటే, ఇది దుమ్ము మరియు నీటి-నిరోధకతను కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ ఫాస్ట్ చిప్ సెట్ స్నాప్ డ్రాగన్ 8 Gen1 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 12GB LPDDR5 RAM మరియు 256GB UFS 3.1 స్టోరేజ్‌తో జత చేయబడింది. ఈ స్మార్ట్ ఫోన్ Android 12 ఆధారిత ColorOS 12 తో చైనాలో విడుదల చెయ్యబడింది.      

ఆప్టిక్స్ పరంగా,  వన్ ప్లస్ 10 ప్రో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి వుంది. ఇందులో f/1.8 అపర్చర్ తో 48MP సెన్సార్,  50MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు 3.3 X Zoom తో కూడిన 8MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఈ కెమెరా Hasselblad ద్వారా ట్యూన్ చేయబడ్డాయి మరియు 4K UHD లో 120FPS వరకు రికార్డ్ చేయగలవని కంపెనీ తెలిపింది. సెల్ఫీల కోసం ముందు 32MP సెల్ఫీ కెమెరా ఉంది.

OnePlus 10 Pro ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ పెద్ద 5,000mAh బ్యాటరీని 80W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు 50W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో కలిగివుంది.

OnePlus 10 Pro: ధర

వన్ ప్లస్ 10 ప్రో 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్‌ కలిగిన బేస్ వేరియంట్ CNY 4699 ధరతో, 256GB స్టోరేజ్ వేరియంట్ CNY 4999 మరియు 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ CNY 5299 ధరతో ప్రకటించింది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :