ICC క్రికెట్ వరల్డ్ కప్ 2019 LIVE మ్యాచ్ ఎక్కడి నుండైనా ఇలా చూడవచ్చు

Updated on 03-Jun-2019
HIGHLIGHTS

క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న పండుగ వచ్చేసింది. ICC క్రికెట్ వరల్డ్ కప్ 2019 ఈ రోజు నుండి మొదలవనునుంది.

క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న పండుగ వచ్చేసింది. ICC క్రికెట్ వరల్డ్ కప్ 2019  ఈ రోజు నుండి మొదలవనునుంది.  ఈ మహా రణరంగంలో, మొదటి మ్యాచ్ దక్షిణాఫ్రికా మరియు ఇంగ్లాండ్ మధ్య లండన్, ఓవల్ వేదికగా జరగనుంది. తదుపరి మ్యాచ్ అనగా, మే 31 వ తేదీన జరగనున్న క్రికెట్ ప్రపంచ కప్ 2019 రెండవ మ్యాచ్, పాకిస్థాన్ మరియు వెస్టిండీస్ మధ్య జరగనుంది.

ICC క్రికెట్ వరల్డ్ కప్ 2019,  మే 30 వ తేదీ మొదలుకొని జూలై 14 వరకు కొనసాగుతుంది. అదనంగా మీరు కూడా ఈ మొత్తం సిరీస్ LIVE చూడవచ్చు. దీని అర్థం మీరు ప్రతి బంతిని ప్రత్యక్షంగా చూడవచ్చు. అయితే, ఈ రోజు మనం ICC క్రికెట్ వరల్డ్ కప్ 2019 ప్రత్యక్షంగా ఎలా చూడవచ్చనే దాని గురించి తెలుసుకుందాం.

భారత క్రికెట్ ప్రపంచ కప్ 2019 మ్యాచ్లను LIVE లో ఎలా చూడాలి?

ఈ ICC క్రికెట్ వరల్డ్ కప్ 2019 యొక్క బ్రాడ్కాస్ట్ రైట్స్ అన్ని కూడా స్టార్ ఇండియా అందుకుంది. ఇది కాకుండా, స్టార్ స్పోర్ట్స్ నుండి ఇండియాలో అన్ని మ్యాచ్లను మీరు చూడవచ్చు. మీరు స్టార్ ఇండియా ఆప్ సందర్శించడం ద్వారా లేదా క్రికెట్ ప్యాక్ తో మీ టీవీలో రీఛార్జ్ చేయడం ద్వారా  ICC ప్రపంచ క్రికెట్ కప్ 2019 మ్యాచ్లు చూడవచ్చు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారన్న పట్టింపు లేదు. మీరు ఏ సమయంలోనైనా స్టార్ ఇండియా యొక్క అప్లికేషన్ ద్వారా చూడవచ్చు, మరియు TV లో మీరు ఒక క్రికెట్ ప్యాక్ ద్వారా 2019 లో అన్ని క్రికెట్ మ్యాచ్లను చూడవచ్చు.

అయితే, మీకు స్టార్ యాక్సెస్ చేయలేకపోయారని, ఆందోళన పడిల్సిన పనిలేదు. మీరు కేవలం Hotstar నుండి కూడా ఈ సౌలభ్యాన్ని పొందవచ్చు. అందుకోసం మీరు ఈ ఈ App కి సైన్ ఇన్ చేయాలంతే. అంటే, 2019 ప్రపంచ కప్ నుండి  అన్ని మ్యాచ్లను మీరు దీని ద్వారా చూడవచ్చు. కానీ, ఇది ఉచితం సేవ కాదు. దీనికోసం,  మీరు కొంత డబ్బు చెల్లించాలి. దీనికోసం నెలకు రూ .299 చెల్లించవలసి ఉంటుంది, లేదా మీరు సంవత్సరానికి ఈ సేవ కోసం రూ .999 చెల్లించాలి.   

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :