ఇటీవల, శామ్సంగ్ M సిరీస్ నుండి మార్కెట్లోకి తెసుకేచినటువంటి ఒక ట్రిపుల్ రియర్ కెమేరా ఫోన్ అయినటువంటి గెలాక్సీ M30 స్మార్ట్ ఫోన్ యొక్క ఫ్లాష్ సేల్స్ ఇప్పటివరకూ జరుగగా, ఇక ఇప్పటి నుండి ఓపెన్ సేల్ ద్వారా దీని అమ్మకాలను జరపనునట్లు తెసులుస్తోంది. శామ్సంగ్ యొక్క ఈ గెలాక్సీ M30 కేవలం ఒక ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్పును మాత్రమేకాకుండా , సూపర్ అమోలెడ్ డిస్ప్లే మరియు 5000mAh భారీ బ్యాటరీ వంటి ప్రత్యేకతలతో అత్యంత సరసమైన ధరలో లభిస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ M30 స్మార్ట్ ఫోన్ను HDFC బ్యాంక్ యొక్క డెబిట్ మరియు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి 5% తక్షణ డిస్కౌంట్ అఫర్ అందుబాటులో ఉంటుంది. అలాగే, జియో భాగస్వామ్యంతో ఈ ఫోను కొనుగోలుచేసేవారికి, డబుల్ డేటా అఫర్ దొరుకుతుంది, దీనితో దాదాపుగా 3110 రూపాయల విలువగల ప్రయోజనాలను అందిస్తోంది జియో. అలాగే, 6 నెలల EMI ఎంపికతో కొనులు చేసేవారికి No Cost EMI కూడా అందుబాటులో ఉంటుంది.
శామ్సంగ్ గెలాక్సీ M30 – 4GB + 64GB – Rs.14,990
శామ్సంగ్ గెలాక్సీ M30 – 6GB + 128GB – Rs.17,990
శామ్సంగ్ గెలాక్సీ M30 స్మార్ట్ ఫోన్ 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.4 అంగుళాల సూపర్ AMOLED ఇన్ఫినిటీ – U డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది ఒక ఎక్సినోస్ 7904 ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది. ఈ ప్రొసెసరు ఒక ట్రిపుల్ రియర్ కెమేరాకు అనుకూలిస్తుంది. ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 8.0.1 పైన ఆధారితంగా శామ్సంగ్ యూజర్ ఎక్స్పీరియన్స్ పైన నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక భారీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 64GB వేరియంట్ మరియు మరొక 6GB ర్యామ్ జతగా 128GB వేరియంట్తో వస్తుంది. ఒక SD కార్డు ద్వారా 512GB స్టోరేజిని పెంచుకునే సామర్ధ్యంతో వస్తుంది.
ఇక కెమెరావిభగానికి వస్తే, ఇది వెనుక భాగంలో 13MP +5MP+5MP ట్రిపుల్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇందులో 13MP ప్రధాన కెమరా మరియు 5MP అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్లకోసం మరియు మరొక 5MP డెప్త్ ని పసిగట్టటానికి ఉపయోగపడుతుంది. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం 16MP కెమెరాని అందించారు. సెల్ఫీలను క్లిక్ చేయడంతో పాటుగా ఇది పేస్ రికగ్నైజేషన్ కోసం కూడా ఉపయోగపడుతుంది. ఇందులో అందించిన స్టిక్కర్లతో మంచి ఫన్నీ ఫోటోలను సెల్ఫీలను తీసొకొవచ్చు