ఇక ఓపెన్ సేల్ కి అందుబాటులో REDMI 7 స్మార్ట్ ఫోన్

HIGHLIGHTS

ఇక అందరికి ఓపెన్ సేల్ ద్వారా అందుబాటులో ఉంటుంది.

కేవలం, రూ.7,999 రూపాయల బడ్జెట్ ధరలో మంచి ప్రత్యేకతలను కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటి వరకు అజరిగిన ఫ్లాష్ సేల్స్ నుండి మంచి అమ్మకాలను సాధించినట్లు, షావోమి చెబుతోంది.

ఇక ఓపెన్ సేల్ కి అందుబాటులో  REDMI 7 స్మార్ట్ ఫోన్

ఇప్పటివరకూ REDMI 7 స్మార్ట్ ఫోన్ను ఫ్లాష్ సేల్ ద్వారా కొనలేకపోయారా ? అయితే, మీకు ఇప్పుడు ఒక శుభవార్త, ఇప్పటివరకూ కేవలం ఫ్లాష్ సేల్ ద్వారా మాత్రమే అమ్మకానికి వచ్చిన షావోమి యొక్క ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్, ఇప్పుడు ఇక అందరికి ఓపెన్ సేల్ ద్వారా అందుబాటులో ఉంటుంది. కేవలం, రూ.7,999 రూపాయల బడ్జెట్ ధరలో మంచి ప్రత్యేకతలను కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటి వరకు అజరిగిన ఫ్లాష్ సేల్స్ నుండి మంచి అమ్మకాలను సాధించినట్లు, షావోమి చెబుతోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

షావోమి రెడ్మి 7 ధర మరియు ఆఫర్లు

షావోమి రెడ్మి 7 –  2GB RAM + 32GB స్టోరేజి ధర – 7,999

షావోమి రెడ్మి 7 –  3GB RAM + 32GB స్టోరేజి ధర – 8,999

ఈ ఫోనుతో పాటుగా జియో యొక్క భాగస్వామ్యంతో 4.5 TB 4G డేటా మరియు 2,200 రూపాయల క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్లను ప్రకటించింది.

షావోమి రెడ్మి 7  ప్రత్యేకతలు

షావోమి రెడ్మి 7 స్మార్ట్ ఫోన్,  HD+ రిజల్యూషన్ అందించగల ఒక 6.26 అంగుళాల డాట్ నోచ్ డిస్ప్లేతో అందించబడింది. ఈ ఫోన్ ఒక 19:9 ఆస్పెక్ట్ రేషియాతో వస్తుంది మరియు ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో దీని స్క్రీన్ ప్రొటెక్ట్ చెయ్యబడింది. ఇది ఒక క్వాల్కమ్ స్నాప్డ్ డ్రాగన్ 632 ఆక్టా కోర్ ప్రొసెసరు శక్తితో నడుస్తుంది.  ఈ స్మార్ట్ ఫోన్ ఒక భారీ 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 2GB ర్యామ్ జతగా 32GB స్టోరేజితో వస్తుంది. అధనంగా, ఒక SD కార్డు ద్వారా 512GB స్టోరేజిని పెంచుకునే సామర్ధ్యంతో వస్తుంది. ఇది కమెట్ బ్లూ, ఎక్లిప్స్  బ్లాక్ మరియు లూనార్ రెడ్ వంటి కలర్ ఎంపికలతో  ఎంచుకునేలా లభిస్తుంది.

ఇక కెమెరావిభగానికి వస్తే, ఇది వెనుక భాగంలో 12MP + 2MP  డ్యూయల్ రియర్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇందులో 12MP ప్రధాన కెమరా మరియు 2MP పోర్ట్రైట్ షాట్లకోసం ఉపయోగపడుతుంది. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం ఒక 8MP AI కెమెరాని అందించారు. ఇందులో సెల్ఫీలను క్లిక్ చేయడం  పామ్ షట్టర్ అనే కొత్త ఫీచరుతో వస్తుంది. అధనంగా, ఈ స్మార్ట్ ఫోన్ ఒక Pi2 టెక్నలాజితో వస్తుంది కాబట్టి, నీటి తుంపరలు మరియు హ్యుమిడిటీ నుండి రాకాశానను ఇసుంది.               

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile