నోకియా 8.1 పైన రూ.12,000 భారీ డిస్కౌంట్

Updated on 09-Sep-2019
HIGHLIGHTS

ZEISS ఆప్టిక్స్ కలిగినటువంటి ఒక ప్రధాన 12MP కెమేరాకు జతగా మరొక 13 MP కెమేరాని కలిగినటువంటి డ్యూయల్ రియర్ కెమేరా మరియు ముందు 20 MP సెల్ఫీ కెమేరాతో వస్తుంది.

 నోకియా ఇటీవల  గొప్ప స్పెక్స్ మరియు కెమేరాలతో ఇండియాలో తీసుకొచ్చినటువంటి, నోకియా 8.1 స్మార్ట్ ఫోన్ పైన ఇప్పుడు ఏకంగా Rs . 12,000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది. నోకియా అధికారిక వెబ్సైట్ నుండి ప్రస్తుతం కేవలం రూ. 15,999 ధరతో  ఈ స్మార్ట్ ఫోన్ను అమ్ముడు చేస్తోంది. వాస్తవానికి, ముందుగా ఈ స్మార్ట్ ఫోన్ Rs. 27,999 ధరతో ఇండియాలో విడుదల చేసింది.

నోకియా 8.1 ప్రత్యేకతలు

ఈ నోకియా 8.1 స్మార్ట్ ఫోన్ 1080x 2284 పిక్సెళ్ల రిజల్యూషన్ అందించగల ఒక 6.18 అంగుళాల FHD+ డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ తన డిస్ప్లే యొక్క పై భాగంలో ఒక సెల్ఫీ కెమేరా మరియు స్పీకర్ ఇముడ్చుకున్న ఒక సంప్రదాయ నోచ్ ను కలిగివుంది. ఇక పనితీరు విషయానికివస్తే, ఈ నోకియా 8.1 స్మార్ట్ ఫోన్ ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రాసెసర్  కి జతగా,  ఒక 4GB ర్యామ్ మరియు 64 GB అంతర్గత మెమొరీతో వస్తుంది మరియు దీని  స్టోరేజిని మైక్రో SD కార్డుతో 400GB వరకు విస్తరించుకోవచ్చు .

ఇక కెమేరాల విభాగానికివస్తే, నోకియా 8.1 ఒక ZEISS ఆప్టిక్స్ కలిగినటువంటి ఒక ప్రధాన 12MP కెమేరాకు జతగా మరొక 13 MP కెమేరాని కలిగినటువంటి డ్యూయల్ రియర్ కెమేరా మరియు ముందు 20 MP సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ బాక్స్ నుండి బయటకువస్తూనే సరికొత్త Android 9.1 Pie తో నడుస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :