ఇక నోకియా ఫోన్ల పూర్తిస్థాయి తయారీ ఇండియాలోనే :రిపోర్ట్

Updated on 27-Mar-2019
HIGHLIGHTS

HMD గ్లోబల్ 2-4 సంవత్సరాలలో టాప్ మూడు స్మార్ట్ ఫోన్ తయారీదారులో ఒకటిగా అవతరిస్తుందని, మెహతా అభిప్రాయపడ్డారు.

HMD గ్లోబల్, నోకియా స్మార్ట్ ఫోన్ల తయారీదారైన ఈ సంస్థ, ఇక నుండి భారతదేశం నుండి ఉత్పత్తి చేయబడ్డ నోకియా హ్యాండ్ సెట్లను ఎగుమతి చేయడానికి, తమ ప్రణాళికలు సిద్ధం చేసే దిశగా,ఈ సంస్థ చర్చలు ప్రారంభించింది. HMD గ్లోబల్ యొక్క వైస్ ప్రెసిడెంట్ మరియు ఇండియా హెడ్ ఆఫ్ ఇండియా, అజయ్ మెహతా, ఎకనామిక్ టైమ్స్ తో మాట్లాడుతూ, ఈ సంస్థ ఇతర దేశాలకు ఫీచర్ ఫోన్లు మరియు స్మార్ట్ ఫోన్లను విస్తరణ చేయనుందని అన్నారు.

HMD గ్లోబల్ అన్ని దేశాలకు ఇండియా-మేడ్ నోకియా హ్యాండ్ సెట్లను ఎగుమతి చేయాలని ఆలోచిస్తున్నట్లు మరియు భారత్ నుంచి సమీప  దేశాలైన వాటికీ  ఈ  పరికరాలను ప్రధానంగా ఎగుమతి చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. భారతదేశంలో, ఇప్పుడు దాదాపుగా దాని మొత్తం పోర్ట్ఫోలియోల తయారీని చేయాలనీ కంపెనీ తయారుచేస్తోంది కాబట్టి, వీటిని భారతదేశము నుండి ఎగుమతి చేసే అవకాశమున్నదని మెహతా అభిప్రాయపడ్డారు. ఇలా సామూహికంగా ఎగుమతి చేయడం ద్వారా, అధిక మొత్తంలో స్థానిక ఉత్పత్తిని సాధించవచ్చని మరియు ఓవర్ హెడ్స్ మరియు ఇతర ఖర్చులను తగ్గించగలదని HMD విశ్వసిస్తుంది.

అయితే, HMD గ్లోబల్ భారతదేశంలో వీటి భాగాలను తయారీచేస్తే మాత్రమే, ఎగుమతులు సాధ్యమవుతాయని మెహతా అన్నారు. ఈ విషయంగా, ఈ కంపెనీ ఫాక్స్ఆన్ తో  చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం, కంపెనీ PCB లను తయారుచేస్తోంది మరియు భారతదేశంలో యూనిట్లును అసంబల్ మాత్రమే చేస్తుంది.

కేవలం రెండు సంవత్సరాలలో, నోకియా 8.5-9 శాతం మార్కెట్ వాటాతో భారతదేశం లో టాప్ మూడు ఫీచర్ ఫోన్ తయారీదారులలో ఒకటిగా మారింది. భారతదేశంలో వీటి స్మార్ట్ ఫోన్లు 3.5-5 శాతం వాటాను కలిగి ఉన్నాయి. HMD గ్లోబల్ 2-4 సంవత్సరాలలో టాప్ మూడు స్మార్ట్ ఫోన్ తయారీదారులో ఒకటిగా  అవతరిస్తుందని, మెహతా అభిప్రాయపడ్డారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :