ఆరోగ్య సేతు అప్ ఇక జియోఫోన్లకు కూడా..

ఆరోగ్య సేతు అప్ ఇక జియోఫోన్లకు కూడా..
HIGHLIGHTS

ఇప్పుడు అది జియోఫోన్ ‌లకు కూడా చేరుకుంది

టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MEITY) గురువారం తన బ్లూటూత్ కాంటాక్ట్-ట్రాకింగ్ యాప్‌ ను 50 లక్షల జియో ఫోన్ వినియోగదారుల కోసం ఆరోగ్య సేతు యాప్ విడుదల చేసినట్లు తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క టెలికాం యూనిట్ విక్రయించే చౌకైన ఇంటర్నెట్-ఎనేబుల్ ఫోన్ అయినటువంటి jioPhone ల కోసం ఈ ఆప్ ని తీసుకొచ్చింది.

జియో తన జియో ఫోన్ల ‌కోసం భారతదేశంలో కరోనోవైరస్ కాంటాక్ట్-ట్రేసింగ్ యాప్ ఆరోగ్య సేతు యొక్క వెర్షన్‌ను కొద్ది రోజుల్లోనే విడుదల చేయడానికి సిద్దమైంది. ఆరోగ్య సేతు యాప్ ‌లో అన్ని ఫీచర్లు ఉన్నాయని నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని గురించి సమాచారం కొద్ది రోజుల క్రితం బయటకు వచ్చింది.

దేశంలో కరోనోవైరస్ వ్యాప్తిపై పోరాడటానికి మార్చి చివరిలో ప్రపంచంలోనే అతిపెద్ద లాక్‌డౌన్ విధించబడింది, ఆ తర్వాత భారతదేశంలో కరోనా వైరస్ నివారణలో తీసుకున్న చర్యల్లో భాగంగా  ఆరోగ్య సేతు (హెల్త్ బ్రిడ్జ్) యాప్‌ ను గత నెలలో ప్రారంభించారు. ఆరోగ్య సేతు యాప్ బ్లూటూత్ మరియు GPS -ఎనేబుల్ యాప్. ఇది COVID-19 కోసం పాజిటివ్ టెస్ట్ తర్వాత వారితో కాంటాక్ట్ అయిన   వ్యక్తుల గురించి వినియోగదారులను హెచ్చరిస్తుంది.

ఈ యాప్, అనగా ఆరోగ్యా సేతు యాప్ ను సుమారు 10 కోట్ల మంది భారతీయులు డౌన్‌లోడ్ చేశారు. ఇప్పటి వరకు ఇది ఆండ్రాయిడ్ మరియు iOS ఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉంది, కానీ ఇప్పుడు అది జియోఫోన్ ‌లకు కూడా చేరుకుంది, ఇప్పుడు ఇది జియో ఫోన్లలో కనిపిస్తుంది ఇది రాబోయే సమయంలో మరిన్ని ఇతర ఫీచర్లతో విస్తరించబడుతుంది.

ఆరోగ్యా సేతు యాప్ ఆపిల్ యొక్క యాప్ స్టోర్ మరియు గూగుల్ యొక్క ప్లే స్టోర్ యొక్క టాప్ 10 యాప్స్ లో కూడా చోటు దక్కించుకుంది. ఇంతకుముందు ఈ యాప్ Android మరియు iOS వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేది, కానీ ఇప్పుడు ఇది ల్యాండ్‌లైన్ మరియు ఫీచర్ ఫోన్ వినియోగదారులకు కూడా అందుబాటులో ఉంది.

ఇందుకోసం ఆరోగ్య సేతు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవిఆర్ఎస్) సేవను ప్రవేశపెట్టారు, ఇది టోల్ ఫ్రీ సేవ. ఈ సేవలో, ఫీచర్ ఫోన్ మరియు ల్యాండ్‌లైన్ వినియోగదారుల కోసం '1921' టోల్ ఫ్రీ నంబర్ ఉంచబడింది. ఈ నంబర్ ‌కు మిస్డ్ కాల్ చేసినప్పుడు, వినియోగదారుకు మళ్లీ తిరిగి కాల్ వస్తుంది మరియు కాల్ ‌లో ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడుగుతారు. త్వరలో ఈ యాప్ జియోఫోన్ కోసం కూడా అందుబాటులో ఉంటుంది మరియు సంస్థ ఇప్పటికే దానిపై పనిచేయడం ప్రారంభించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo