Nothing Phone 4a Pro Sale with starts with big deals on tomorrow
Nothing Phone 4a Pro Sale: ఇండియాలో నథింగ్ సరికొత్తగా విడుదల చేసిన లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ 4a ఇప్పటి వరకు ప్రీ ఆర్డర్స్ కోసం మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, ఈ ఫోన్ రేపటి నుంచి సేల్ కు అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ మొదటి సేల్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ సేల్ ప్రారంభం కావడానికి ముందుగా ఈ ఫోన్ ప్రైస్, ఆఫర్స్ మరియు స్పెక్స్ కంప్లీట్ గా తెలుసుకోండి.
నథింగ్ ఫోన్ 4a ప్రో మూడు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది మరియు మూడు రంగుల్లో కూడా లభిస్తుంది. ఈ ఫోన్ సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ మూడు వేరియంట్ ప్రైస్ వివరాలు ఈ క్రింద చూడవచ్చు.
ఈ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ కూడా కంపెనీ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ పై అందించిన లాంచ్ ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై ICICI మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ పై రూ. 4,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఇది కాకుండా ఈ ఫోన్ పై రూ. 1,000 అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది.
Also Read: iQOO Z11x 5G: పవర్ ఫుల్ మిడ్ రేంజ్ ఫోన్ గా లాంచ్ అయ్యింది.!
ఈ లేటెస్ట్ నథింగ్ ఫోన్ అల్యూమినియం యూని బాడీ మరియు Glyph Matrix లైటింగ్ తో కొత్త డిజైన్ లో వచ్చింది. ఇందులో 6.83 ఇంచ్ బిగ్ AMOLED స్క్రీన్ ను 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, మరియు 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో అందించింది. ఈ ఫోన్ HDR10+ సపోర్ట్ తో కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7 Gen 4 ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 12 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఇది Nothing OS 4.1 సాఫ్ట్ వేర్ మరియు ఆండ్రాయిడ్ 16 OS తో వచ్చింది.
కెమెరా పరంగా, ఈ ఫోన్ 50MP మెయిన్, 50MP పెరిస్కోప్ మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. ఈ ఫోన్ అత్యధికంగా 140x అల్ట్రా జూమ్ ఫీచర్ కలిగి ఉంది. ఇది ఏఐ కెమెరా ఫీచర్స్ మరియు స్టేబుల్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5080 mAh బ్యాటరీతో వచ్చింది మరియు 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్, డాల్బీ అట్మాస్ మరియు హై ఫై సౌండ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP65 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కలిగి ఉంటుంది.