Nothing Phone (3a) top 5 features and price know here
Nothing Phone (3a) ఈరోజు లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఆకట్టుకునే ఫీచర్స్ మరియు ప్రైస్ ట్యాగ్ తో నథింగ్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ చూడగానే ఆకర్షించే లుక్స్ తో పాటు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో స్టన్నింగ్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. మరి నథింగ్ లేటెస్ట్ లాంచ్ చేసిన ఫోన్ (3a) టాప్ 5 ఫీచర్స్ మరియు ప్రైస్ ఏమిటో తెలుసుకుందామా.
నథింగ్ ఫోన్ (3a) స్మార్ట్ ఫోన్ ప్రారంభ వేరియంట్ 8GB + 128GB ను రూ. 24,999 ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క 8GB + 256GB వేరియంట్ ను రూ. 26,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మొదటి సేల్ మార్చి 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది.
Snapdragon 7s Gen 3 చిప్ సెట్ తో ఈ నథింగ్ ఫోన్ (3a) ఫోన్ ను లాంచ్ చేసింది. ఇది 4 nm Gen 2 TSMC ప్రోసెసర్ టాప్ టైర్ పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. అంతేకాదు, దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటాయి.
ఈ నథింగ్ ఫోన్ 6.77 ఇంచ్ ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే, ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, HDR 10+ సపోర్ట్ మరియు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది.
నథింగ్ ఫోన్ (3a) లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో శామ్సంగ్ 50MP మెయిన్ కెమెరా, శామ్సంగ్ 50MP టెలిస్కోప్ కెమెరా మరియు Sony 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. అంతేకాదు, ముందు 50MP శామ్సంగ్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ మంచి డిటైల్స్ కలిగిన 4K వీడియోలు మరియు మంచి డీటెయిల్స్ తో ఫోటోలు అందిస్తుందని నథింగ్ చెబుతోంది. ఈ ఫోన్ 2x ఆప్టికల్ జూమ్ మరియు 30x అల్ట్రా జూమ్ సపోర్ట్ తో కూడా వస్తుంది.
ఈ నథింగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. ఈ బిగ్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 50W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 7.5W రివర్స్ వైర్డ్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా వస్తుంది.
Also Read: Vivo T4x 5G: 6500 mAh భారీ బ్యాటరీ మరియు ఫాస్ట్ ప్రోసెసర్ తో రేపు లాంచ్ అవుతుంది.!
ఈ నథింగ్ ఫోన్ Nothing OS 3.1 తో ఆండ్రాయిడ్ 15 OS పై నడుస్తుంది. ఈ ఫోన్ 3 సంవత్సరాల OS అప్డేట్స్ మరియు 6 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అందుకుంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ ప్రత్యేకమైన Glyph Fill Light సెటప్ తో కూడా వస్తుంది.