Nothing Phone (3a) Pro: స్టన్నింగ్ ఫీచర్స్ మరియు డిజైన్ తో లాంచ్ అయ్యింది.!

Updated on 04-Mar-2025
HIGHLIGHTS

Nothing Phone (3a) Pro ను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది

నథింగ్ ఫోన్ (3a) ప్రో స్మార్ట్ ఫోన్ స్టన్నింగ్ ఫీచర్స్ మరియు డిజైన్ తో లాంచ్ అయ్యింది

Snapdragon 7s Gen 3 చిప్ సెట్ తో లాంచ్ చేసింది

Nothing Phone (3a) Pro స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. బార్సిలోనా లో జరుగుతున్న MWC 2025 నుంచి నథింగ్ ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. నథింగ్ ఫోన్ (3a) ప్రో స్మార్ట్ ఫోన్ స్టన్నింగ్ ఫీచర్స్ మరియు డిజైన్ తో లాంచ్ అయ్యింది. ఈ రోజే సరికొత్తగా విడుదలైన నథింగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దామా.

Nothing Phone (3a) Pro: ఫీచర్స్

నథింగ్ ఫోన్ (3a) ప్రో స్మార్ట్ ఫోన్ ను Snapdragon 7s Gen 3 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఇది 4 nm Gen 2 TSMC ప్రోసెసర్ మరియు వేగంగా పని చేస్తుంది. అంతేకాదు, ఈ చిప్ సెట్ కి జతగా 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 6.77 ఇంచ్ ఫ్లెక్సిబుల్ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు పాండా గ్లాస్ రక్షణతో ఉంటుంది. ఈ ఫోన్ ను చాలా పటిష్టమైన మరియు ఆకట్టుకునే డిజైన్ తో నథింగ్ లాంచ్ చేసింది.

ఈ నథింగ్ స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. ఈ సెటప్ లో 50MP Samsung మెయిన్ కెమెరా, 50MP Sony పెరిస్కోప్ కెమెరా మరియు 8MP Sony అల్ట్రా వైడ్ కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ లో ముందు 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ తో మంచి డిటైల్స్ కలిగిన 4K వీడియోలు 30fps వద్ద రికార్డ్ చేయవచ్చని నథింగ్ తెలిపింది. అంతేకాదు, మంచి వివరాలతో ఫోటోలు కూడా పొందవచ్చట. ఈ కెమెరా OIS మరియు EIS సపోర్ట్ తో పాటు 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ లో కెమెరా కోసం ప్రత్యేకమైన బటన్ ను కూడా నథింగ్ అందించింది.

నథింగ్ ఈ ఫోన్ ను 5,000 mAh బిగ్ బ్యాటరీ మరియు 50W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు 2 హై డెఫినేషన్ మైక్స్ కూడా ఉన్నాయి. నథింగ్ ఈ ఫోన్ ను Nothing OS 3.1 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 15 OS తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 3 సంవత్సరాల మేజర్ అప్డేట్స్ మరియు 4 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ ప్రత్యేకమైన Glyph Fill Light సెటప్ తో కూడా వస్తుంది.

Also Read: కేవలం 17 వేల ధరలో 43 ఇంచ్ 4K QLED Smart tv కోసం వెతుకుతుంటే ఒక లుక్కేయండి.!

Nothing Phone (3a) Pro: ప్రైస్

నథింగ్ ఈ ఫోన్ ను రెండు వేరియంట్లలో అందించింది. ఈ ఫోన్ యొక్క 8GB + 128GB బేసిక్ వేరియంట్ ను రూ. 29,999 ప్రారంభ లాంచ్ చేసింది. ఈ ఫోన్ మార్చి 11వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ నథింగ్ అధికారిక వెబ్సైట్ తో పాటు Flipkart, విజయ్ సేల్స్, Coma మరియు అన్ని ప్రధాన రిటైల్ స్టోర్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ పై గొప్ప లాంచ్ ఆఫర్లు కూడా అందించింది. మార్చి 11వ తేదీ అన్ని ఆఫర్స్ తో కలిపి ఈ ఫోన్ ను కేవలం రూ. 24,999 రూపాయల ప్రారంభ ధరకే పొందవచ్చని నథింగ్ తెలిపింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :