Nothing Phone (3a) Series: ట్రిపుల్ కెమెరాతో రెండు ఫోన్లు లాంచ్ చేస్తున్న నథింగ్.!

Updated on 26-Feb-2025
HIGHLIGHTS

Nothing Phone (3a) Series నుంచి రెండు ఫోన్లను విడుదల చేస్తోంది

పేరుకు తగ్గట్టు ఈ సిరీస్ ఫోన్లను ట్రిపుల్ రియర్ కెమెరా సపోర్ట్ తో తీసుకు వస్తుంది

ఆకర్షణీయమైన డిజైన్ తో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్లను తీసుకు వస్తోంది

Nothing Phone (3a) Series నుంచి రెండు ఫోన్లను విడుదల చేస్తోంది. పేరుకు తగ్గట్టు ఈ సిరీస్ ఫోన్లను ట్రిపుల్ రియర్ కెమెరా సపోర్ట్ తో తీసుకు వస్తుంది. అంతేకాదు, మరింత ఆకర్షణీయమైన డిజైన్ మరియు మరిన్ని ఫీచర్స్ తో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్లను తీసుకు వస్తోంది. ఈ సిరీస్ నుంచి రాబోతున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ వివరాలు ఏమిటో తెలుసుకుందామా.

Nothing Phone (3a) Series: లాంచ్

నథింగ్ అప్ కమింగ్ స్మార్ట్ సిరీస్ 3a నుంచి రెండు ఫోన్లను లాంచ్ చేస్తోంది. ఈ సిరీస్ ను మార్చి 4వ తేదీ సాయంత్రం 3:30 గంటలకు ఇండియాలో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ లను సరికొత్త డిజైన్ మరియు ఫీచర్ తో లాంచ్ చేయనున్నట్లు నథింగ్ టీజింగ్ చేస్తోంది.

Nothing Phone (3a) Series: ఫీచర్స్

నథింగ్ అప్ కమింగ్ సిరీస్ నుంచి రెండు ఫోన్ లను ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ లలో ప్రీమియం వేరియంట్ ప్రీమియం రౌండ్ కెమెరా బంప్ డిజైన్ ను కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో పెరిస్కోప్ కెమెరా కూడా ఉంటుంది. రెండవ ఫోన్ కూడా ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది.

నథింగ్ ఫోన్ 3a సిరీస్ ను Snapdragon లేటెస్ట్ చిప్ సెట్ తో చేస్తుందని, నథింగ్ తెలిపింది. ఈ ఫోన్ లలో కూడా అదే ట్రాన్స్పరెంట్ బ్యాంక్ ప్యానల్ మరియు నోటిఫికేషన్ లైట్ సెటప్ ఉంటుంది. అయితే, ఈ అప్ కమింగ్ డిజైన్ మాత్రం సరికొత్తగా అందించింది.

Also Read: OnePlus Pad Go పై అమెజాన్ మెగా టాబ్లెట్ డేస్ సేల్ బిగ్ డీల్స్.!

కంపెనీ ఇప్పటి వరకు అందించిన టీజర్ ఇమేజ్ ల ద్వారా ఈ ఫోన్ లో గొప్ప కెమెరా సెటప్ ఉన్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు, ఈ సిరీస్ నుంచి వచ్చే ఒక ఫోన్ లో Snapdragon 7s Gen 2 చిప్ సెట్ ఉండవచ్చని భావిస్తున్నారు. అంతేకాదు, ఒక ఫోన్ లో వెనుక 50MP మెయిన్, 8MP అల్ట్రా వైడ్ మరియు 10MP మూడవ సెన్సార్ కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.

ఈ ఫోన్ లాంచ్ నాటికి ఈ ఫోన్ వివరాలు టీజర్ ద్వారా నథింగ్ అందించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :