nothing cmf could available at lowest price ever from Flipkart BBD Sale
Flipkart BBD Sale వచ్చే సోమవారం నుంచి ఫ్లిప్ కార్ట్ యూజర్లకు ప్రారంభం అవుతుంది. ఈ సేల్ నుంచి నథింగ్ లేటెస్ట్ ట్రిపుల్ రియర్ కెమెరా ఫోన్ ను రూ. 14,999 ధరకే అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది. అప్ కమింగ్ సేల్ కోసం ఫ్లిప్ కార్ట్ ఈ డీల్ ను ముందుగానే అనౌన్స్ చేసింది. ఈ లేటెస్ట్ నథింగ్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ అందించిన డీల్స్ మరియు ఈ ఫోన్ ఫీచర్స్ ముందే తెలుసుకోండి.
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుంచి ముందుగా ఆఫర్స్ ను సెలెక్ట్ చేసుకోవడానికి వీలుగా అందించిన విష్ లిస్ట్ లో ఈ డీల్ ను లిస్ట్ చేసింది. ఇక డీల్ విషయానికి వస్తే, CMF by Nothing Phone 2 Pro స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ ఈ బిగ్ డీల్స్ అందించింది. రీసెంట్ గా ఈ ఫోన్ ను ఇండియాలో రూ. 18,999 రూపాయల ప్రారంభ ధరతో ఇండియాలో లాంచ్ చేసింది.
ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి రూ. 16,999 ప్రైస్ తో లభిస్తుంది. ఇది కాకుండా ఈ ఫోన్ పై 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ మరియు మరిన్ని ఆఫర్స్ తో కేవలం రూ. 14,999 రూపాయల ఆఫర్ ధరతో లభిస్తుందని ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ కొనాలని చేసే యూజర్లు ఈ ఫోన్ ఆఫర్ ను విష్ లిస్ట్ ద్వారా పరిశీలించవచ్చు.
Also Read: Kodak Matrix సిరీస్ నుంచి బడ్జెట్ ధరలో QLED Smart Tv లు లాంచ్ చేసింది.!
ఈ స్మార్ట్ ఫోన్ 50MP వైడ్ యాంగిల్, 50MP టెలీ లెన్స్ మరియు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 2x ఆప్టికల్ జూమ్, 20x డిజిటల్ జూమ్, 4K వీడియో రికార్డింగ్ మరియు మంచి కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.77 ఇంచ్ AMOLED ఫ్లెక్సిబుల్ LTPS స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది ఇన్ స్క్రీన్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 3000 నిట్స్ గొప్ప బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.
ఈ నథింగ్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300 Pro 5G చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 7.8mm స్లీక్ మరియు స్టన్నింగ్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ నథింగ్ స్మార్ట్ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.