Nothing (3a) Series teasing with new design and feature button
Nothing (3a) Series: నథింగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ అనౌన్స్ చేసిన నథింగ్ ఈ ఫోన్ అప్ కమింగ్ ఫోన్స్ గురించి డైలీ కొత్త టీజింగ్ వివరాలు అందిస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ డిజైన్ మరియు కెమెరా వివరాలు కనిపించేలా టీజర్ ఇమేజ్ లను అందించిన నథింగ్, ఇప్పుడు ఈ ఫోన్ యొక్క ప్రత్యేకమైన డిజైన్ వివరాలు మరియు కొత్త ఫీచర్ బటన్ గురించి టీజింగ్ చేస్తోంది.
నథింగ్ (3a) సిరీస్ ను ఇండియాలో మార్చి 4 వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు విడుదల చేస్తున్నట్లు డేట్ మరియు టైం కన్ఫర్మ్ చేసింది. అయితే, ఈ సిరీస్ నుంచి ఎన్ని ఫోన్ లను విడుదల చేస్తుందో మాత్రం ప్రకటించలేదు. అయితే, నథింగ్ అధికారిక X అకౌంట్, కంపెనీ వెబ్సైట్ మరియు Flipkart నుంచి ఈ అప్ సిరీస్ ఫీచర్స్ తో యాక్టివ్ గా టీజింగ్ చేస్తోంది.
నథింగ్ ప్రస్తుతానికి ఇప్పటి వరకు అందించిన టీజర్ ఇమేజెస్ ద్వారా ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందుగా అందించిన సిరీస్ మాదిరి Glyph Interface ను కలిగి ఉన్నట్లు అర్థం అవుతోంది. అయితే, అప్ కమింగ్ ఫోన్ లైట్ సెటప్ లో చాలా మార్పులు ఉండేలా కనిపిస్తోంది.
ఇక రీసెంట్ గా అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లో యాపిల్ లేటెస్ట్ ఐఫోన్ 16 సిరీస్ లో అందించిన ప్రత్యేకమైన కెమెరా బటన్ మాదిరి బటన్ ఒకటి ఉన్నట్లు చూపించింది. ఇది LED లైట్ వెలుగులో కనిపిస్తోంది మరియు చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అయితే, ఇది ఎటువంటి అవసరాల కోసం ఉపయోగపడే అవకాశం ఉన్నదో మాత్రం ఇంకా వెల్లడించలేదు.
Also Read: Realme P3 Pro: స్నాప్ డ్రాగన్ లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ తో లాంచ్ డేట్ అనౌన్స్.!
అయితే, ఈరోజు మరొక కొత్త టీజర్ ను విడుదల చేసింది. ‘Rooted In Transparency’ ట్యాగ్ లైన్ తో కొత్త వీడియో మరియు ఇమేజ్ ను షేర్ చేసింది. పైన పదం అర్థం “పారదర్శకతలో పునాది వేయబడినది” అనేలా ఉంటుంది. అంటే, ఈ ఫోన్ యొక్క డిజైన్ ను వివరించేలా ఈ ట్యాగ్ లైన్ అందించేట్లు భావిస్తున్నారు. ఎందుకంటే, ఈ టీజర్ వీడియో లో కూడా లైట్ వెలుగులో ఫోన్ ;లోపలి పార్ట్స్ కనిపిస్తున్నట్లు ఉంది. అయితే, దీని సరైన అర్ధం తెలియాలంటే మాత్రం మరో అప్డేట్ వరకు వేచి చూడాల్సి ఉంటుంది.