Nokia 2660 Flip 4G ను మరో రెండు అందమైన కలర్స్ లో లాంచ్ చేసిన నోకియా.!

HIGHLIGHTS

Nokia 2660 Flip 4G ను మరో రెండు అందమైన కలర్ అప్షన్ లలో లాంచ్ చేసింది

నోకియా వెబ్సైట్ మరియు అమేజాన్ నుండి సేల్ అవుతున్నాయి

Nokia 2660 Flip 4G స్మార్ట్ ఫోన్ అన్ని వేరియంట్స్ రూ. 4,499 ధరతో వస్తాయి

Nokia 2660 Flip 4G ను మరో రెండు అందమైన కలర్స్ లో లాంచ్ చేసిన నోకియా.!

నోకియా నుండి రీసెంట్ గా వచ్చిన Flip ఫీచర్ ఫోన్ Nokia 2660 Flip 4G ను మరో రెండు అందమైన కలర్ అప్షన్ లలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మంచి అధరన పొందిన బడ్జెట్ ఫ్లిప్ ఫోన్ గా నిలవడంతో నోకియా ఈ ఫోన్ యొక్క మరో 2 వేరియంట్స్ ను కూడా విడుదల చేసింది. ఈ రెండు వేరియంట్స్ కూడా ఇప్పుడు నోకియా వెబ్సైట్ మరియు అమేజాన్ నుండి సేల్ అవుతున్నాయి. నోకియా లాంచ్ చేసిన కొత్త కలర్ వేరియంట్స్ మరియు వాటి ధరతో పాటుగా స్పెక్స్ గురించి తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 Nokia 2660 Flip 4G: కొత్త కలర్స్ 

Nokia 2660 Flip 4G స్మార్ట్ ఫోన్ ముందుగా బ్లాక్, బ్లూ మరియు రెడ్ కలర్ లలో లభిస్తుండగా, ఇప్పుడు కొత్తగా Lush Green మరియు Pop Pink అనే రెండు కొత్త కలర్ అప్షన్ లలో కూడా లభిస్తుంది. 

ఈ అన్ని కలర్ వేరియంట్స్ కూడా ఒకే ధరతో వస్తాయి. Nokia 2660 Flip 4G స్మార్ట్ ఫోన్ అన్ని వేరియంట్స్ రూ. 4,499 ధరతో వస్తాయి. ఈ ఫోన్ పైన ప్రధాన బ్యాంక్ కార్డ్స్ తో No Cost EMI అఫర్ ను అమేజాన్ తన ఆన్లైన్ ప్లాట్ ఫామ్ పైన అందించింది.     

Nokia 2660 Flip 4G: ప్రత్యేకతలు 

Nokia 2660 Flip 4G స్మార్ట్ ఫోన్ ఫీచర్ ఫోన్ యూజర్లకు అనుకూలమైన పెద్ద Key Pad Button లతో వస్తుంది. ఈ నోకియా ఫ్లిప్ ఫోన్ లో 2.8 ఇంచ్ బిగ్ స్క్రీన్ మరియు కాల్స్ తో పాటుగా నోటిఫికేషన్స్ కోసం ముందు చిన్న స్క్రీన్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక సింగిల్ కెమేరా వుంది. 

ఈ నోకియా ఫ్లిప్ ఫోన్ MP3 Player తో వస్తుంది మరియు నోకియా యొక్క క్లాసీ గేమ్ Classic Snake game తో కూడా వస్తుంది. ఈ ఫోన్ ఒక వారం పని చెయ్యగల బ్యాటరీ తో వస్తుంది. నోకియా 2660 ఫ్లిప్ 4G ఫీచర్ ఫోన్ డ్యూయల్ SIM సపోర్ట్ తో వస్తుంది మరియు 4G సపోర్ట్ ను కలిగి వుంది. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo