వెయ్యి రూపాయల లోపే మరిన్ని ఫీచర్లతో Nokia New Phone లాంచ్.!

HIGHLIGHTS

ఇండియన్ మార్కెట్ లో Nokia New Phone ను Nokia 105 classic ను లాంచ్ చేసింది.

వెయ్యి రూపాయల లోపే మరిన్ని ఫీచర్లతో కొత్త ఫీచర్ ఫోన్

కొత్త ఫీచర్ ఫోన్ చూస్తున్న వారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్ అవుతుంది

ఇండియన్ మార్కెట్ లో Nokia New Phone ను నోకియా 105 క్లాసిక్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను కేవలం వెయ్యి రూపాయల లోపే మరిన్ని ఫీచర్లతో ఈ కొత్త ఫీచర్ ఫోన్ ను తీసుకురావడం విశేషం. ఈ ఫోన్ లో UPI payment ఫీచర్ మరియు తగిన ఇతర ఫీచర్లతో నోకియా తీసుకు వచ్చింది. వెయ్యి రూపాయల ధరలో కొత్త ఫీచర్ ఫోన్ చూస్తున్న వారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్ అవుతుంది. మరి భారత్ లో నోకియా లాంచ్ చేసిన ఈ కొత్త ఫీచర్ ఫోన్ మరియు దాని వివరాలు ఏమిటో చూద్దామా.

Nokia New Phone price

నోకియా కొత్తగా లాంచ్ చేసిన ఫీచర్ ఫోన్ నోకియా 105 క్లాసిక్ ఫీచర్ ఫోన్ రూ. 999 ధరలో ప్రకటించింది మరియు ఈ ఫోన్ బ్లూ మరియు చార్కోల్ బ్లాక్ కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క స్పెక్స్ మరియు ఫీచర్స్ ను క్రింద చూడవచ్చు.

Also Read : Amazon Finale Days సేల్ నుండి Xiaomi స్మార్ట్ టీవీ పైన ధమాకా అఫర్.!

నోకియా 105 క్లాసిక్

నోకియా 105 క్లాసిక్ ఫీచర్ ఫోన్ ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయాలు రెండు. ఈ ఫోన్ ను ఒక సంవత్సరం రీప్లేస్మెంట్ గ్యారింటీతో అందించడం మొదటి ముఖ్యమైన విషయం అయితే, ఆన్లైన్ పేమెంట్ కోసం UPI పేమెంట్ ఫీచర్ ను ఈ ఫోన్ లో అందించడం మరొక ముఖ్యమైన విషయం.

నోకియా 105 క్లాసిక్ ఫీచర్ ఫోన్

ఈ ఫోన్ లో 800mAh బ్యాటరీని కలిగి ఉంటుంది మరియు సింగిల్ ఛార్జ్ తో రోజుల తరబడి పని చేస్తుందని నోకియా తెలిపింది. ఈ ఫోన్ లో టైపింగ్ మరియు కాలింగ్ కోసం తగిన పెద్ద కీప్యాడ్, వైర్ లెస్ FM మరియు మరింత సమర్ధవంతమైన ఆడియో మరియు మరింత సౌకర్యవంతమైన డిజైన్ తో ఈ ఫోన్ ను అందించినట్లు నోకియా తెలిపింది.

అయితే, ఏ ఫోన్ ఇంకా నోకియా స్టోర్ (వెబ్సైట్) నుండి లిస్టింగ్ చేయబడలేదు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :