షాకింగ్ ధరతో నోకియా ఫోన్ లాంచ్: ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

Updated on 12-Aug-2021
HIGHLIGHTS

నోకియా అతితక్కువ ధరలో కొత్త 4G ఫోన్ లాంచ్ చేసింది

ఈ ఫోన్ చాలా కాంపాక్ట్ గా ఉంటుంది

టాప్ ఫీచర్ ఫోన్లకు కూడా గట్టి పోటీఇవ్వనుంది

భారతదేశంలో బడ్జెట్ యూజర్లను దృష్టిలో ఉంచుకొని నోకియా అతితక్కువ ధరలో మంచి ఫీచర్లతో తన కొత్త 4G ఫీచర్ ఫోన్ ను లాంచ్ చేసింది. నోకియా యొక్క ఈ లేటెస్ట్ ఫీచర్ ఫోన్ ను ప్రస్తుతం మార్కెట్లో వున్న టాప్ ఫీచర్ ఫోన్లకు కూడా గట్టి పోటీఇవ్వనుంది. Nokia 110 4G పేరుతో మార్కెట్లోకి తీసుకువచ్చిన ఈ ఫోన్ బెస్ట్ ఫీచర్లను కలిగివుంది. ఈ ఫీచర్ ఫోన్ చాలా కాంపాక్ట్ గా ఉంటుంది మరియు 3,000 రూపాయల కన్నా తక్కువ రేటుకే ఇండియాలో లభిస్తోంది.

Nokia 110 4G: Price

Nokia 110 4G ఫీచర్ ఫోన్ రూ.2,799 రేటుతో విడుదల అయ్యింది. ఈ ఫోన్ పసుపు, నలుపు మరియు ఆక్వా కలర్ అప్షనలలో లభిస్తుంది. ఈ ఫోన్ అమెజాన్ మరియు నోకియా ఆన్లైన్ సైట్స్ ద్వారా లభిస్తుంది.            

Nokia 110 4G: ఫీచర్స్

నోకియా 110 4 జి ఫోన్ 1.8-ఇంచ్  QVGA (120×160 పిక్సెల్స్) కలర్ డిస్‌ప్లేను కలిగివుంది. ఈ హ్యాండ్‌సెట్ Unisoc T107 ప్రాసెసర్‌ శక్తితో  పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 128 MB ర్యామ్, 48 MB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఉంది. ఒక మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్ ను 32GB వరకూ విస్తరించవచ్చు. ఈ ఫోన్‌లో 0.8 మెగాపిక్సెల్ VGA కెమెరా ఉంది. ఈ ఫోన్ Series 30+ OS (ఆపరేటింగ్ సిస్టమ్‌) తో పనిచేస్తుంది.

ఈ ఫోన్ 1020 mAh రిమూవల్ బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీ 13 రోజుల స్టాండ్‌బై సమయం, 16 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ మరియు 5 గంటల 4 జి టాక్‌టైమ్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంది.  ఈ ఫోన్లో టెక్స్ట్ ను వాయిస్ గా మార్చే Redit ఫీచర్, MP3 ప్లేయర్ మరియు మరిన్ని ఫీచర్లతో ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :