నోకియా నుండి కొత్త ఫ్లిప్ ఫీచర్ ఫోన్ ను ఆకర్షణీయమైన ఫీచర్లతో ప్రకటించిన HMD Global. అదే, నోకియా 2660 ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో ఇటీవలే ఆవిష్కరించింది. ఈ 4G ఫీచర్ ఫోన్ పాత ఫ్లిప్ డిజైన్ మరియు కొత్త లేటెస్ట్ ఫీచర్ల సమాహారంగా అందించడం విశేషం. అంతేకాదు,
Survey
✅ Thank you for completing the survey!
నోకియా 2660 ఫ్లిప్ తో పాటుగా Nokia 8210 4G క్లాసీ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ కూడా పెద్ద డిస్ప్లేతో వస్తుంది మరియు దాని మన్నికైన మరియు సొగసైన డిజైన్ ను ఈ ఫోన్ కలిగివుంది. ఈ ఫోన్ ధర స్పెక్స్ మరియు ఫిచర్లను క్రింద చూడవచ్చు.
నోకియా 2660 ఫ్లిప్ ఫీచర్ ఫోన్ భారతదేశంలోని అన్ని రిటైల్ అవుట్ లెట్స్, Nokia.com మరియు ఇ-కామర్స్ సైట్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ నలుపు, నీలం మరియు ఎరుపు రంగు ఎంపికలలో లభిస్తుంది మరియు రూ. 4699 ధరతో అందుబాటులో ఉంది.
ఇక నోకియా 2660 ఫ్లిప్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ 2.8 ఇంచ్ మైన్ స్క్రీన్ ను జూమ్ చేసిన యూజర్ ఇంటర్ఫేస్ తో కలిగివుంది. అంటే, మీకు స్పష్టమైన మరియు పెద్ద రూపాన్ని డిస్ప్లే పైన అందిస్తుంది మరియు 1.77 ఇంచ్ ఫ్రంట్ డిస్ప్లే ఇన్కమింగ్ కాల్ లను సులభంగా గుర్తించేలా చేస్తుంది. ఈ ఫోన్ లో అందించిన బిగ్ బటన్స్ తో మీ మెసేజ్ టైపింగ్ లో ఎటువంటి తప్పులు దొర్లవు. ఈ ఫోన్ తేలికగా వున్నా ఈ ఫోన్ 1450 mAh బ్యాటరీని కలిగివుంది.
ఈ ఫోన్ అడ్జెస్ట్ చేయగల వాల్యూమ్ సెట్టింగ్లతో స్పష్టమైన కాల్ నాణ్యతను అందిస్తుంది మరియు వినికిడి సహాయానికి అనుకూలమైనది (HAC). ఈ ఫోన్ ,మన్నిక పరంగా కూడా ఎక్కువ టెస్టింగ్ లను కూడా తట్టుకొని నిలబడింది. ఈ ఫోన్ లో 0.3 MP కెమెరాని కూడా నోకియా అందించింది. ఈ ఫోన్ డ్యూయల్ 4G సిమ్ లకు సపోర్ట్ చేస్తుంది మరియు 48MB ర్యామ్+128MB ఇంటర్నల్ స్టోరేజిలను కలిగివుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile