JioExclusive అఫర్ తో అతితక్కువ ధరకే వచ్చిన Nokia C01 Plus స్మార్ట్ ఫోన్

Updated on 13-Sep-2021
HIGHLIGHTS

Nokia C01 Plus భారీ అంచనాల మధ్య విడుదల

నోకియా సి01 ప్లస్ ఎంట్రీ లెవల్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్

ఈ నోకియా ఫోన్ Jio Exclusive అఫర్ తో వచ్చింది

HMD గ్లోబల్ ఇండియన్ మర్కెట్లో తన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Nokia C01 Plus ను భారీ అంచనాల మధ్య విడుదల చేసింది. ఈ లేటెస్ట్ నోకియా ఎంట్రీ లెవల్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.5,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో వచ్చింది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ఫోన్ ను రిలయన్స్ Jio Exclusive Offer తో తీసుకువచ్చింది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం (గో ఎడిషన్) మరియు మరిన్ని ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చింది. ఈ లేటెస్ట్ నోకియా స్మార్ట్ ఫోన్ గురించి అన్ని వివరాలను ఈ క్రింద చూడవచ్చు.

Nokia C01 Plus: ప్రైస్&ఆఫర్స్

ఈ నోకియా సి01 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను రూ.5,999 రూపాయల ధరతో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ను జియో ఎక్స్ క్లూజివ్ అఫర్ క్రింద కొనేవారికి 10% ఇన్స్టాంట్ ప్రైస్ సపోర్ట్ లభిస్తుంది. అంటే, ఈ ఫోన్ ను కేవలం రూ.5,399 రూపాయల ధరకే పొందవచ్చు. ఈ ఫోన్ అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్స్, ఇకామర్స్ మరియు నోకియా అధికారిక వెబ్సైట్ నుండి లభిస్తుంది.  

Nokia C01 Plus: స్పెక్స్

నోకియా సి01 ప్లస్ స్మార్ట్ ఫోన్ 5.45 ఇంచ్ HD డిస్ప్లేని కలిగివుంది. ఈ ఫోన్ 1.6 GHz క్లాక్ స్పీడ్ గల ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పనిచేస్తుంది. అలాగే, 2జిబి ర్యామ్ మరియు 16జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో అవస్తుంది.ఈ నోకియా బడ్జెట్ ఫోన్ ఆండ్రాయిడ్ 11 OS (గో ఎడిషన్) తో వస్తుంది మరియు రెండు సంవత్సరాల వరకూ అప్డేట్స్ అందిస్తుంది. ఈ ఫోన్ లో వెనుక 5MP సింగిల్ కెమెరా HDR సపోర్ట్  వుంది మరియు ఫ్రెంట్ 2MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 3000 mAh రిమూవబుల్ బ్యాటరీని మరియు ఫేస్ అన్లాక్ ఫీచర్ ను కూడా కలిగివుంది.     

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :