NOKIA 9.3 ప్యూర్ వ్యూ 108MP, 64MP కెమెరా 120Hz డిస్ప్లే వంటి భారీ స్పెక్స్ తోరావచ్చు

NOKIA 9.3 ప్యూర్ వ్యూ 108MP, 64MP కెమెరా 120Hz డిస్ప్లే వంటి భారీ స్పెక్స్ తోరావచ్చు

నోకియా 9.3 ప్యూర్‌ వ్యూ, 120 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే మరియు 108 MP  ప్రైమరీ కెమెరాతో వస్తోందని, 64 MP సెన్సార్ కూడా ఇందులో   చేరగలదని రూమర్ వచ్చింది. నోకియా యొక్క వర్చువల్ MWC 2020 ఈవెంట్‌ లో నోకియా 8.3, 5.3, 1.3 మరియు పునరుద్ధరించిన నోకియా 5310 ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ ప్రారంభమైనప్పటి నుండి 9.3 ప్యూర్ వ్యూ వార్తల్లో ఉంది.

నోకియా 9.3 ప్యూర్‌వ్యూ గురించి ముందుగా వచినవార్తల్లో  Q 3 2020 కు ఆలస్యం అవుతుందని చెప్పబడింది మరియు ఇప్పుడు వచ్చిన పుకార్లు, ఈ ఫోన్ చుట్టూ మరిన్ని వివరాలను చెబుతోంది. నోకియా కొత్తగా చేసిన ట్వీట్ ప్రకారం, 9.3 ప్యూర్‌వ్యూ 108 MP కెమెరాతో శామ్సంగ్ సెన్సార్‌ మరియు సోనీ సెన్సార్‌ ను ఉపయోగించే సెకండరీ 64 MP కెమెరాతో రావచ్చు.

మరింత ప్రామాణికమైన సెటప్ కోసం సంస్థ తన తాజా ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ తో తన కంప్యుటేషనల్ ఫోటోగ్రఫీ విధానాన్ని వదిలివేస్తున్నట్లు కనిపిస్తోంది. సెన్సార్లలో ఒకటి OIS కి కూడా మద్దతు ఇస్తుంది.

మునుపటి నివేదికల ప్రకారం నోకియా 9.3 ప్యూర్‌వ్యూ కోసం 24 MP, 20 MP, 48 MP కెమెరా సెన్సార్‌ లతో ప్రయోగాలు చేసింది, అయితే నిజ జీవితంలో ఫోన్ను చూడడానికి ఇంకా చాలా సమయం పడుతుంది.

ఇటీవల, హెచ్‌ఎండి గ్లోబల్‌ లోని చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ జుహో సర్వికాస్ రాబోయే నోకియా 9.3 కోసం తన అభిమాన రంగు ఎంపికలను గురుంచి టీజ్ చేశారు మరియు అతను పోలార్ నైట్ రంగును ఇష్టపడుతున్నాడని మరియు మునుపటి నోకియా ఫోన్ల కాపర్ వెర్షన్  మాదిరిగా కొత్త మరియు మంచి వాటిని పేర్కొన్నాడు.

నోకియా 9.3 ఫోన్ 5G సపోర్ట్‌ తో టాప్-ఆఫ్-ది-లైన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 చిప్ యొక్క శక్తితో వస్తుంది. QHD + రిజల్యూషన్ ఉన్న 6.29-అంగుళాల OLED స్క్రీన్‌ తో ఈ ఫోన్ రావచ్చని సూచించే మునుపటి లీక్స్ మరియు ఇది అధిక రిఫ్రెష్ రేట్ స్క్రీన్‌ గా నిర్ణయించబడిందని మనకు ఇప్పటికే తెలుసు.

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచంలోని అనేక ప్రాంతాలు ప్రస్తుతం మొత్తం లాక్డౌన్లో ఉన్నందున, లాంచ్ లకు సంబంధించినంతవరకు స్మార్ట్ఫోన్ కంపెనీ లు వెనకడుగు వెయ్యడానికి దారితీసింది. అయితే, వన్‌ప్లస్ మరియు ఆపిల్ ఇటీవల తమ కొత్త స్మార్ట్‌ ఫోన్లను ప్రకటించాయి మరియు లాక్‌డౌన్ ముగిసిన తర్వాత మరిన్ని కంపెనీలు ఇదే అనుసరిస్తాయని భావిస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo