NOKIA 7. 1 ఎన్నడూ చూడనంత తక్కువ ధరకు అమ్ముడవుతోంది

Updated on 21-Sep-2019
HIGHLIGHTS

Rs. 7,000 రూపాయల భారీ డిస్కౌంట్

కేవలం మిడ్ రేంజ్ ధర పరిధిలో ఈ నోకియా 7.1 స్మార్ట్ ఫోన్ మంచి స్పెక్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Zeiss డ్యూయల్ రియర్ కెమెరాలు మరియు ఆండ్రాయిడ్ వన్ తో వస్తుంది. వాస్తవానికి, ఈ స్మార్ట్ ఫోన్ను రూ 19,999 రూపాయల ధరతో మార్కెట్లోకి తీసుకురాగా, ముందుగా ఈ ధరలో కూడా Nokia.com వెబ్సైట్ నుండి HMD గ్లోబల్ దీనిపైన 2000 రూపాయల తగ్గింపును ప్రకటించి,  రూ. 17,999 ధరకు సేల్ అమ్ముడు చేసింది. ఆతరువాత, మొత్తంగా 5,000 రుపాయల డిస్కౌంట్ ధరతో ఈ స్మార్ట్ ఫోన్ను అమెజాన్ ఇండియా ద్వారా కేవలం రూ. 14,999 ధరతో సేల్ చేసింది. ఇక కొత్తగా అందించిన 7,000 రూపాయల భారీ డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.12,999 ధరతో లభిస్తోంది.                   

నోకియా 7.1 ప్రత్యేకతలు

ఈ డిస్ప్లే కూడా ఒక 19: 9 ఆస్పెక్ట్ రేషియా గల ఒక 5.84 అంగుళాల Full HD + తో ఉంటుంది. ఈ డిస్ప్లే పైన ఒక నోచ్ ఉంది, కానీ ఇది ఇతర ఫోన్లలో చూసిన వంటి పెద్ద నోచ్ మాత్రం కాదు. ఈ డిస్ప్లే, ఒక గ్లాస్ శాండ్విచ్ బాడీతో ఉంది. ఈ నోకియా ఫోన్ను నిగనిగలాడే గ్లాస్ ఫినిషింగ్ కోసం 6000 సిరీస్ అల్యూమినియం ఉపయోగించారు. నోకియా 6 (2018) వలెనే, బాడీలో డైమండ్ కట్ ఛాంబర్స్ కట్ ఉంది, ఇది ఫోన్ కి ప్రత్యేకమైన రూపాన్ని అందిస్తుంది. ఈ ధర విభాగంలో వచ్చే స్మార్ట్ ఫోన్లన్నింటిలో కూడా ఈ ఫోన్ను గుర్తించడం చాల సులభం.

క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 636 SoC కి జతగా 4GB RAM మరియు 64GB అంతర్గత స్టోరేజి తో, ఈ నోకియా 7.1 వస్తుంది. ఈ  చిప్సెట్, నోకియా 6.1 ప్లస్ మరియు షావోమి రెడ్మి నోట్ 5 ప్రో కూడా కలిగి వున్నాయి మరియు ఈ ప్రాసెసర్ మిడ్-రేంజ్ సెగ్మెంట్లో చాలా మంచి పనితీరు అందిస్తున్నట్లు నిరూపించబడింది. ఇది ఇంచు మించుగా, మీ రోజువారీ వాడకానికి  కావాల్సిన  ప్రతి విషయాన్నీనిర్వహించగలుగుతుంది. స్టాక్ Android ఇంటర్ఫేస్ ఈ ఫోన్లో ఉంటుంది కాబట్టి, అన్ని విషయాలు చాల అనుకూలంగా చేస్తుంది. ఈ నోకియా 7.1 కూడా అన్ని నోకియా ఫోన్ల వలనే Android One ధృవీకరణతో వస్తుంది మరియు సాధారణ భద్రతా అప్డేట్స్ కి హామీ ఇస్తుంది.  ఒక 3,060mAh బ్యాటరీ కలిగి ఉంది మరియు ఇది ఒక రోజంతా కావాల్సిన పనికి సరిపోతుందని నోకియా తెలిపింది. ఒకవేళ లేకపోతే,  30 నిమిషాల్లో ఫోన్ను 50 శాతానికి ఛార్జ్ చేయగల వేగవంతమైన ఛార్జర్ బాక్స్ తో పాటుగా లభిస్తుంది.

Zeiss ఆప్టిక్స్

HMD గ్లోబల్ సంస్థ , ఈ నోకియా 7.1 తో Zeiss ఆప్టిక్స్ ని తిరిగి తీసుకువచ్చింది. ముందు వచ్చిన, నోకియా 5.1 ప్లస్ మరియు నోకియా 6.1 ప్లస్ ఫోన్లలో ఈ Zeiss సర్టిఫైడ్ ఆప్టిక్స్ లేవు. ఈ నోకియా 7.1  Zeiss సర్టిఫైడ్ చేసిన ఒక 12MP + 5MP డ్యూయల్ కెమెరా మరియు ముందు  8MP సెల్ఫీ కెమెరాని కలిగి ఉంటుంది. AI ఆధారిత పోర్ట్రైడ్ మోడ్ కూడా అందించారు.   

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :