ఇండియాలో రేపు విడుదలకానున్న NOKIA 6.2 స్మార్ట్ ఫోన్

Updated on 10-Oct-2019
HIGHLIGHTS

ఫోన్ యొక్క ప్రత్యేకతలు మరియు లాంచ్ డేట్ కూడా వెల్లడయ్యాయి.

నోకియా 6.2 ను గత నెలలో IFA 2019 సందర్భంగా ప్రవేశపెట్టారు. అదే కార్యక్రమంలో, HMD గ్లోబల్ సంస్థ నోకియా 6.2 తో పాటుగా అనేక నోకియా ప్రొడక్టులను  ప్రవేశపెట్టింది. అయితే, ప్రస్తుతం కంపెనీ ఈ నోకియా 6.2 ను భారతదేశంలో కూడా విడుదల చేయబోతోంది. అమెజాన్ ఇండియాలో అందించిన ఒక టీజర్ ద్వారా ఈ ఫోన్ గురించిన వివరాలు, ఫోన్ యొక్క ప్రత్యేకతలు మరియు లాంచ్ డేట్ కూడా వెల్లడయ్యాయి.

ఇక ధర గురించి చూస్తే , ఈ నోకియా 6.2 ధర యూరోపియన్ మార్కెట్లో 199 యూరోల నుండి మొదలవుతుంది, ఇది మన కరెన్సీలో చూస్తే సుమారు 15,800 రూపాయలుగా ఉంటుంది. ఈ ఫోన్ యొక్క సెల్ కూడా అక్టోబర్‌ నెలలోనే  ప్రారంభమవుతుంది. యూజర్లు ఈ ఫోన్‌ను సిరామిక్ బ్లాక్ అండ్ ఐస్ కలర్‌లో కొనుగోలు చెయవచ్చు.

నోకియా 6.2 ప్రత్యేకతలు

డ్యూయల్ సిమ్‌తో కూడిన ఈ నోకియా ఫోన్ ఆండ్రాయిడ్ పై OS తో నడుస్తుంది మరియు HDR 10 మద్దతు ఇవ్వగల ఒక 6.3-అంగుళాల FHD + డిస్ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ 3 యొక్క రక్షణను కలిగి ఉంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే, ఇది ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్‌తో 4 జీబీ వరకు ర్యామ్‌ను అందించారు. దీనితో పాటు, ఈ ఫోన్ 3,500 mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడుతుంది.

ఈ నోకియా 6.2 లో, 16 మెగాపిక్సెల్స్ + 5 మెగాపిక్సెల్స్ + 8 మెగాపిక్సెల్ సెన్సార్లతో మూడు వెనుక కెమెరాలు ఉన్నాయి. ఈ నోకియా 6.2 యొక్క ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 128 జిబి వరకు ఉంది. కనెక్టివిటీ ఫీచర్లలో వై-ఫై 802.11 ఎసి, బ్లూటూత్ 5.0, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, జిపిఎస్ మరియు 4G LTE  వంటివి ఉన్నాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :