NOKIA 3.2, నోకియా నుండి విడుదలైన అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్

HIGHLIGHTS

HMD గ్లోబల్ నుండి NOKIA 3.2 ఇండియాలో అత్యంత చౌకధరతో విడుదల చెయ్యబడింది.

ఈ స్మార్ట్ ఫోన్ను వాటర్ డ్రాప్ నోచ్,ఒక ప్రత్యేకమైన గూగుల్ అసిస్టెంట్ బటన్ మరియు 4000mAh వంటి ప్రత్యేకతలతో కేవలం రూ. 8990 రుపాయల ప్రారంభధరలో తీసుకొచ్చింది.

ఇది ఒక ప్లాస్టిక్ బాడీతో, బ్లాక్ మరియు స్టీల్ వంటి రెండు రంగుల ఎంపికలతో వస్తుంది.

NOKIA 3.2, నోకియా నుండి విడుదలైన అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్

HMD గ్లోబల్ నుండి NOKIA 3.2  ఇండియాలో అత్యంత చౌకధరతో విడుదల చెయ్యబడింది. ఇప్పుడు, ప్రతి ఒక్క బ్రాండ్ కూడా ఇండియాలో బడ్జెట్ వినియధారులను టార్గెట్ చేసుకొని తమ స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తుండగా, HMD గ్లోబల్ కూడా ఈ NOKIA 3.2  విడుదలతో ఈ సెగ్మెంట్ పరిధిలో తన సత్తాచాటుకోనుంది. ఈ స్మార్ట్ ఫోన్ను వాటర్ డ్రాప్ నోచ్,ఒక ప్రత్యేకమైన గూగుల్ అసిస్టెంట్ బటన్ మరియు 4000mAh వంటి ప్రత్యేకతలతో కేవలం రూ. 8990 రుపాయల ప్రారంభధరలో తీసుకొచ్చింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

నోకియా 3.2 ధరలు మరియు ఆఫర్లు  

నోకియా 3.2 – 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజి వేరియంట్ – ధర Rs.8,990

నోకియా 3.2 – 3GB ర్యామ్ మరియు 32GB స్టోరేజి వేరియంట్ – ధర Rs.10,790

ఈ స్మార్ట్ ఫోనుతో పాటుగా వోడాఫోన్ మరియు ఐడియా వినియోగదారులకి 2500 రుపాయల విలువగల క్యాష్ బ్యాక్ అఫర్ అందుబాటులో ఉంటుంది. ఇది 50 రుపాయల విలువగల 50 వోచర్ల రూపంలో అందిస్తుంది. కేవలం 199 రుపాయల్ రీఛార్జ్ మరియు అంతకంటే ఎక్కువ ధరతో రీఛార్జ్ చేయడంతో ఈ వోచరును వాడుకోవచ్చు. అధనంగా, HDFC బ్యాంక్ యొక్క డెబిట్ మరియు క్రెడిట్ మరియు EMI ఎంపికలతో కొనుగోలు చేసేవారికి 10% క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ మే 23 వ తేదీ నుండి, రిటైల్ అవుట్లెట్లు మరియు Nokia.com నుండి మొదలవుతుంది.

నోకియా 3.2 ప్రత్యేకతలు

ఈ నోకియా 3.2 స్మార్ట్ ఫోన్, 1520 x 720 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.26 అంగుళాల HD + వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లేతో మరియు 19:9 ఆస్పెక్ట్ రేషియాతో వస్తుంది. ఇది నోకియా వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లేతో వచ్చిన రెండవ స్మార్ట్ ఫోనుగా ఉంటుంది.  ఇది ఒక ప్లాస్టిక్ బాడీతో, బ్లాక్ మరియు స్టీల్ వంటి రెండు రంగుల ఎంపికలతో వస్తుంది.  ఈ ఫోన్ ఒక క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 429 ప్రోసెసరుకు జతగా 2GB లేదా 3GB ర్యామ్ శక్తితో వస్తుంది మరియు 16GB లేదా 32GB స్టోరేజి తో వస్తుంది.ముఖ్యంగా, ఒక డేడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్ ఇందులో అందించింది.

ఇక కెమేరా విభాగానికి వస్తే, ఇందులో  కేవలం f /2.2 అపర్చరు గల ఒకే ఒక్క 13MP కెమేరాని అందించింది. అలాగే, సెల్ఫీ కోసం ఈ ఫోన్ ముందు భాగంలో ఒక 5MP సెల్ఫీ కెమెరాని అందించింది. అధనంగా, ఇది ఒక 10W చార్జరుతో పాటుగా 4000mAh బయటరీతో వస్తుంది. ఈ బ్యాటరీతో రెండురోజుల వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 2 రోజుల వరకు ఈ  స్మార్ట్ ఫోన్ను వాడుకోవచ్చని సంస్థ చెబుతోంది. ఇది ఆండ్రాయిడ్ వన్ కార్యక్రంమంలో భాగంగా తీసుకొచ్చింది కాబట్టి, అన్ని అప్డేట్లు ముందుగా అందుకలుంటుంది మరియు Android 9 Pie OS తో బాక్స్ నుండి వస్తుంది.       

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile