Nokia 3 కి ఆండ్రాయిడ్ 8 ఒరియో అప్డేట్ ….

Nokia 3 కి ఆండ్రాయిడ్  8 ఒరియో అప్డేట్ ….

 నోకియా 8 కోసం ఒరియో అప్డేట్  అధికారికంగా విడుదలైంది మరియు నోకియా యొక్క ఫోన్స్  కోసం అనేక అప్డేట్ లు లైన్ లో ఉన్నాయి.

అక్టోబర్లో నోకియా 3 కి  7.1.2 అప్డేషన్ వస్తుందని కంపెనీ వాగ్దానం చేసింది , అయితే ఈ అప్డేట్  ఈ డివైస్ కి లభించలేదు  మరియు ఇప్పటికీ నోకియా 3 Android 7.0 పై పనిచేస్తుంది, ఇప్పుడు ఈ డివైస్ ఆండ్రాయిడ్  ఓరియోలో అప్డేట్ తో రానుంది . HMD గ్లోబల్ యొక్క చీఫ్ ప్రొడక్షన్ ఆఫీసర్ Juho Sarvikas తన ట్విట్టర్ అకౌంట్  నుండి యూజర్ ప్రశ్నకు సమాధానం ద్వారా ఈ విషయం  ధ్రువీకరించారు.

అయితే, ఈ అప్డేట్ విడుదలకు తేదీ ఏదీ నివేదించబడలేదు. నోకియా 3 ఒరియో అప్డేట్ కోసం ఇంకా సమయం పట్టవచ్చు .

నోకియా 3 ఫోన్లో 5-అంగుళాల డిస్ప్లే ఉంది, ఇది గొరిల్లా గ్లాస్ తో ప్రొటెక్టెడ్ అయి ఉంటుంది. ఈ ఫోన్ మీడియా టెక్ 6737 SoCలో పనిచేస్తుంది. ఈ ఫోన్లో 2GB RAM మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్  ఉంది. ఈ పరికరం 2650mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్లో,  ప్రైమరీ  మరియు సెకండరీ రెండు కెమెరాలు 8 మెగాపిక్సెల్స్ ఉన్నాయి.

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo