కొత్త ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేసిన నోకియా..ఎలా ఉందంటే..!!
నోకియా మరొక ఆకర్షణీయమైన ఫోన్ ను ఇండియాలో విడుదల చేసింది
నోకియా 2660 ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది
ఈ ఫోన్ డ్యూయల్ 4G సిమ్ లకు సపోర్ట్ చేస్తుంది
HMD Global యాజమాన్యం లోని నోకియా మరొక ఆకర్షణీయమైన ఫోన్ ను ఇండియాలో విడుదల చేసింది. నోకియా 2660 ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంఛన ప్రాయంగా ఆవిష్కరించింది. స్టైల్ మరియు కంఫర్ట్ ప్రధాన అంశాలుగా ఈ ఫోన్ ను తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా, సీనియర్ సిటిజన్ లకు అనుకూలమైన డిజైన్, పెద్ద డిస్‌ప్లే, పెద్ద బటన్స్ వంటి ఫీచర్లను ఇందులో అందించింది. ఇది కేవలం సీనియర్ సిటిజన్లకు మాత్రమే కాదు కీ ప్యాడ్ ఫోన్ కోరుకునే ఎవరికైనా స్టైల్ తో కూడిన గొప్ప ఎంపిక అవుతుంది.
Surveyనోకియా 2660 ఫ్లిప్ తో పాటుగా Nokia 8210 4G ఫోన్ ను కూడా నోకియా లాంచ్ చేసింది. ఈ ఫోన్ కూడా పెద్ద డిస్ప్లేతో వస్తుంది మరియు దాని మన్నికైన మరియు సొగసైన డిజైన్, సహజమైన వినియోగదారు ఇంటర్‌ఫేస్ ను ఈ ఫోన్ కలిగివుంది.
నోకియా 2660 ఫ్లిప్: ధర మరియు ఫీచర్లు
నోకియా 2660 ఫ్లిప్ ఫీచర్ ఫోన్ భారతదేశంలోని అన్ని రిటైల్ అవుట్ లెట్స్, Nokia.com మరియు ఇ-కామర్స్ సైట్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ నలుపు, నీలం మరియు ఎరుపు రంగు ఎంపికలలో లభిస్తుంది మరియు రూ. 4699 ధరతో అందుబాటులో ఉంది.
ఇక నోకియా 2660 ఫ్లిప్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ 2.8 ఇంచ్ మైన్ స్క్రీన్ ను జూమ్ చేసిన యూజర్ ఇంటర్ఫేస్ తో కలిగివుంది. అంటే, మీకు స్పష్టమైన మరియు పెద్ద రూపాన్ని డిస్ప్లే పైన అందిస్తుంది మరియు 1.77 ఇంచ్ ఫ్రంట్ డిస్ప్లే ఇన్కమింగ్ కాల్ లను సులభంగా గుర్తించేలా చేస్తుంది. ఈ ఫోన్ లో అందించిన బిగ్ బటన్స్ తో మీ మెసేజ్ టైపింగ్ లో ఎటువంటి తప్పులు దొర్లవు. ఈ ఫోన్ తేలికగా వున్నా ఈ ఫోన్ 1450 mAh బ్యాటరీని కలిగివుంది.
ఈ ఫోన్ అడ్జెస్ట్ చేయగల వాల్యూమ్ సెట్టింగ్లతో స్పష్టమైన కాల్ నాణ్యతను అందిస్తుంది మరియు వినికిడి సహాయానికి అనుకూలమైనది (HAC). ఈ ఫోన్ ,మన్నిక పరంగా కూడా ఎక్కువ టెస్టింగ్ లను కూడా తట్టుకొని నిలబడింది. ఈ ఫోన్ లో 0.3 MP కెమెరాని కూడా నోకియా అందించింది. ఈ ఫోన్ డ్యూయల్ 4G సిమ్ లకు సపోర్ట్ చేస్తుంది మరియు 48MB ర్యామ్+128MB ఇంటర్నల్ స్టోరేజిలను కలిగివుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile