motorola teasing upcoming Motorola Collections launch in india
Motorola Collections: ఇండియన్ స్మార్ట్ ఫోన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొత్త రకం స్మార్ట్ ఫోన్ కోసం మోటోరోలా టీజింగ్ మొదలు పెట్టింది. మోటోరోలా అప్ ఈ అప్ కమింగ్ ఫోన్ ను క్రిస్టల్స్ కలిగిన బ్యాక్ ప్యానల్ తో లాంచ్ చేస్తున్నట్లు టీజింగ్ మొదలుపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం ప్రపంచ ప్రఖ్యాత క్రిస్టల్స్ కంపెనీ స్వరోవ్‌స్కి తో భాగస్వామ్యం కూడా కుదుర్చుకుంది. ఈ అప్ కమింగ్ ఫోన్ కోసం మొదలు పెట్టిన టీజింగ్ పేజీ నుంచి ఈ వివరాలు వెల్లడించింది.
మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం కొత్తగా టీజింగ్ మొదలు పెట్టింది. ఈ టీజింగ్ లో మోటోరోలా కలెక్షన్స్ పేరుతో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను ప్రపంచ ప్రఖ్యాత నగల వ్యాపార సంస్థ Swarovski తో జత తీసుకొస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లో ఈ కంపెనీ యొక్క క్రిస్టల్స్ ఉంటాయని టీజింగ్ చేస్తోంది.
మోటోరోలా కలెక్షన్స్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను మోటోరోలా ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ ను త్వరలో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా మోటోరోలా టీజింగ్ ప్రారంభించింది. ఈ ఫోన్ డిజైన్ ను తెలిపేలా ఈ ఫోన్ హాఫ్ ఇమేజ్ తో టీజింగ్ చేస్తోంది.
మోటోరోలా కలెక్షన్స్ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్స్ ఇంకా వెల్లడించలేదు. కానీ, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ వెల్లడించే టీజర్ ఇమేజ్ మాత్రం రిలీజ్ చేసింది. ఈ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక ప్రీమియం లెదర్ బ్యాక్ ప్యానల్ లో పొదిగిన క్రిస్టల్స్ ఉన్నట్టు క్లియర్ గా అర్ధం అవుతుంది. ఇప్పటి వరకు ఇండియాలో విడుదలైన స్మార్ట్ ఫోన్స్ తో పోలిస్తే ఈ ఫీచర్ ఈ ఫోన్ ను ప్రత్యేకమైనదిగా చేస్తుంది.
ఈ ఫోన్ లో లో ఉన్న బ్యాక్ కవర్ డైమండ్ కట్ తో ఉంటుంది మరియు ఈ కట్స్ ఏకమయ్యే ప్రాంతాల్లో స్వరోవ్‌స్కి క్రిస్టల్స్ ఉన్నట్లు ఈ టీజర్ ఇమేజ్ చూపిస్తుంది. ఈ ఫోన్ డిజైన్ చూస్తుంటే ఈ ఫోన్ కచ్చితంగా ప్రీమియం ఫోన్ గా వచ్చే అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది.
Also Read: Infinix HOT 60i 5G: 9వేల బడ్జెట్ ధరలో AI సపోర్ట్ మరియు బెస్ట్ డిజైన్ తో వచ్చింది.!
మోటోరోలా త్వరలో ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఫోన్ మరిన్ని అప్డేట్స్ మరియు లాంచ్ డేట్ తో మళ్ళీ కలుద్దాం.