Motorola Razr 60 with cool design and features in India
Motorola Razr 60: మోటోరోలా రేజర్ సిరీస్ నుండి కొత్త ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను కూల్ డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ కొత్త ఫ్లిప్ ఫోన్ ను అండర్ 50 వేల రూపాయల బడ్జెట్ లో లగ్జరీ ఫీచర్స్ తో అందించింది. మోటోరోలా రేజర్ 60 స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను సింగల్ వేరియంట్ తో రూ. 49,999 ధరతో అందించింది. ఈ ఫోన్ గ్రెబల్టార్ సీలైటెస్ట్ స్కై మరియు స్ప్రింగ్ బడ్ మూడు కలర్స్ లో లభిస్తుంది. జూన్ 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తుంది.
మోటోరోలా రేజర్ 60 స్మార్ట్ ఫోన్ 6.9 ఇంచ్ మడతపెట్టే ఫోల్డబుల్ AMOLED మెయిన్ స్క్రీన్ మరియు 3.6 ఇంచ్ వెలుపలి OLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ HDR10+, 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు FHD+ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ ఫ్లిప్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400X చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ చిప్ సెట్ కి జతగా 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.
ఈ మోటోరోలా ఫ్లిప్ ఫోన్ గట్టి డిజైన్ మరియు టైటానియం హింజ్ కలిగి గొప్ప మన్నిక అందిస్తుందని మోటోరోలా తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ అల్ట్రా స్లిమ్ డిజైన్ కలిగి ఉంటుంది మరియు మార్బుల్ ఫినిష్ కలిగిన మొదటి ఫోన్ గా నిలిచింది. ఈ ఫోన్ లో వెనుక 50MP మరియు 13MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో పాటు ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ 4K UHD వీడియో రికార్డ్ సపోర్ట్ మరియు టన్నుల కొద్దీ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: లేటెస్ట్ 5.2.2 Dolby Atmos సౌండ్ బార్ ని డిస్కౌంట్ ధరకే అందించిన అమెజాన్.!
మోటోరోలా రేజర్ 60 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 15 తో వస్తుంది. ఇది 3 ప్రధాన OS అప్డేట్స్ మరియు 4 సంవత్సరాల రెగ్యులర్ అప్డేట్స్ అందుకుంటుంది. మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను 4500 mAh బ్యాటరీ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ గొప్ప అల్యుమినియం ఫ్రేమ్ మరియు ప్రీమియం ఫ్యాబ్రిక్ మెటీరియల్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP48 వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది. ఈ ఫోన్ moto ai సపోర్ట్ కలిగి గొప్ప ai సౌకర్యాలు కలిగి ఉంటుంది.