Motorola Razr 60 Ultra launching as worlds powerful ai flip phone
Motorola Razr 60 Ultra స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు మోటోరోలా ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో శక్తివంతమైన AI ఫ్లిప్ ఫోన్ గా లాంచ్ అవుతోందని ఈ ఫోన్ గురించి మోటోరోలా గొప్పగా చెబుతోంది. దానికి తగిన కారణాలు సైతం కంపెనీ వెల్లడించింది. మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ చేస్తున్న టీజింగ్ మరియు ఈ ఫోన్ ఫీచర్స్ ఏమిటో ఒక లుక్కేద్దామా.
మోటోరోలా రేజర్ 60 అల్ట్రా స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ డేట్ ను మోటోరోలా ఇంకా ఫిక్స్ చేయలేదు. ఈ ఫోన్ ను ప్రస్తుతం ‘Coming Soon’ ట్యాగ్ తో మాత్రమే టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ ను ఆకర్షణీయమైన సరికొత్త డిజైన్ మరియు పవర్ ఫుల్ ఫీచర్స్ తో లాంచ్ చేయబోతున్నట్లు కూడా గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది మరియు ఈ ఫోన్ కోసం అమెజాన్ ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తుంది.
మోటోరోలా రేజర్ 60 అల్ట్రా స్మార్ట్ ఫోన్ డిజైన్ మరియు కీలకమైన ఫీచర్స్ మోటోరోలా రిలీజ్ చేసింది. ఈ ఫోన్ డిజైన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో ఆకట్టుకునే విధంగా కనిపిస్తుంది. మోటోరోలా రేజర్ 60 అల్ట్రా చాలా స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ డిజైన్ కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ ఉడెన్ మరియు చెర్రీ రెడ్ కలర్ వేరియంట్స్ లో అందంగా కన్పిస్తోంది.
ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ విషయానికి వస్తే, మోటోరోలా రేజర్ 60 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను క్వాల్కామ్ పవర్ ఫుల్ చిప్ సెట్ Snapdragon 8 Elite తో లాంచ్ చేస్తున్నట్లు మోటోరోలా కన్ఫర్మ్ చేసింది. ఇది 30 లక్షలకు పైగా AnTuTu స్కోర్ కలిగిన పవర్ ఫుల్ చిప్ సెట్. అంతేకాదు, ఈ ఫోన్ moto ai సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ పవర్ ఫుల్ చిప్ సెట్ తో లాంచ్ అవుతున్న మొదటి ఫ్లిప్ ఫోన్ కూడా ఇదే అవుతుంది.
Also Read: Amazon Sale నుంచి iQOO Z9s 5G స్మార్ట్ ఫోన్ ను 17 వేలకే అందుకోండి.!
ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు సెల్ఫీ కెమెరా ఉన్నట్లు చూడవచ్చు. ఈ ఫోన్ లో పెద్ద ఔటర్ స్క్రీన్ ఉంటుంది మరియు బెజెల్ లెస్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు మరిన్ని ఫీచర్స్ అప్డేట్స్ కూడా మోటోరోలా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.