ఈరోజు ఇండియాలో విడుదలకానున్న మోటరోలా ONE MACRO స్మార్ట్ ఫోన్

Updated on 09-Oct-2019
HIGHLIGHTS

ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది.

మోటరోలా యొక్క వన్ సిరీస్ నుండి మరొక స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో విడుదలకానుంది. ONE MACRO పేరుతొ వన్ సిరీస్ నుండి ఈ రోజు భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఇంతకుముందు మోటో వన్ విజన్, మోటో వన్ యాక్షన్ వంటి ఫోన్లను కంపెనీ మోటో వన్ సిరీస్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క లాంచ్ ఈవెంట్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది.

GSMArena నివేదిక ప్రకారం, రాబోయే స్మార్ట్‌ ఫోన్ యొక్క ఫీచర్‌లో భాగంగా ఒక 2 MP మాక్రో లెన్స్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సౌదీ అరేబియా రిటైల్ వెబ్‌సైట్‌లో కూడా కనిపించింది. స్మార్ట్‌ ఫోన్ను ఫ్లిప్‌కార్ట్‌ నుండి ఇప్పటికే టీజ్ చేస్తోంది. అంటే, ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌ నుండి సేల్ కానున్నట్లు స్పష్టం అవుతోంది.

మోటరోలా వన్ మాక్రో : ప్రత్యేకతలు

ఈ మోటరోలా వన్ మాక్రో, ఇటీవల బెంచ్మార్క్ సైట్ గీక్బెం చ్ లో కనిపించింది మరియు ఈ ఫోన్ 2 GB  ర్యామ్ మరియు 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో జత చేసిన హిలియో P 60 ప్రాసెసర్ యొక్క శక్తితో ఉండనున్నట్లు ఈ లిస్టింగ్ సూచిస్తుంది. అలాగే,ఆండ్రాయిడ్ పై OS తో స్మార్ట్‌ ఫోన్ పనిచేస్తుందని లిస్టింగ్ చూపిస్తుంది. మోటో వన్ మాక్రోలో ఒక 6.1-అంగుళాల డిస్ప్లే ఉంటుంది, పైన వాటర్ డ్రాప్ నోచ్ ఉంటుంది.

మోటరోలా వన్ మాక్రో వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించబడుతుందని మరియు ఒక పెద్ద 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉంటుందని  GSMArena పేర్కొంది.

ఇక కెమెరా గురించి మాట్లాడితే, ఈ స్మార్ ఫోన్ వెనుక ఒక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది, దీనిలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ వంటివి ఉంటాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :