రేపు విడుదలకానున్న Moto G51 5G: ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!

HIGHLIGHTS

మరొక స్మార్ట్ ఫోన్ ను విడుదల చెయ్యడానికి మోటోరోలా సిద్ధమవుతోంది

Moto G51 5G స్మార్ట్ ఫోన్ విడుదల చెయ్యడానికి డేట్ ప్రకటించింది

ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ ఫోన్ రేపు లాంచ్ అవుతోంది

Moto G31 ను ప్రకటించిన కొద్ధి రోజుల్లోనే  మరొక స్మార్ట్ ఫోన్ ను విడుదల చెయ్యడానికి మోటోరోలా సిద్ధమవుతోంది. అయితే, ఈసారి మోటోరోలా 5G స్మార్ట్ ఫోన్ ను విడుదల చెయ్యబోతోంది. Moto G51 5G స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 10 న ఇండియాలో విడుదల చెయ్యడానికి డేట్ ప్రకటించింది మరియు Flipkart ప్రత్యేకంగా ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480 ప్లస్ 5G ప్రోసెసర్ తో వచ్చిన మొట్టమొదటి ఫోన్.

Moto G51: స్పెక్స్

మోటో జి51 స్పెషిఫికేషన్స్ విషయానికి వస్తే, టీజింగ్ ద్వారా ఇప్పటికే చాలా ఫీచర్లను వెల్లడించింది. Moto G51 పెద్ద 6.8 ఇంచ్ FHD+ డిస్ప్లే ని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్నాప్‌ డ్రాగన్ 480 ప్లస్ ఆక్టా కోర్ ప్రాసెసర్‌ మరియు జతగా 8GB RAMతో వస్తుంది. కెమెరాల పరంగా ఈ ఫోన్ వెనుక 50MP ట్రిపుల్ రియర్ మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరాలను కలిగివుంటుంది. ఈ ఫోన్ 20W ర్యాపిడ్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh  బ్యాటరీతో వస్తుంది.  

ఈ ఫోన్ ఇండిగో బ్లూ మరియు బ్రెట్ సిల్వర్ కలర్ అప్షన్ లలో లభిస్తుంది. నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ OS మరియు IP52 వాటర్ రెపెళ్ళంట్ డిజైన్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ ఫోన్ రేపు లాంచ్ అవుతోంది.          

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :