Motorola Edge 70 Pro India launch date and features announced
Motorola Edge 70 Pro: జస్ట్ నిన్ననే మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఎడ్జ్ 70 ప్రో గురించి చర్చించుకున్నాము. ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ యొక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ రానే వచ్చింది. మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ ని కూడా ఈ రోజు మోటరోలా అఫీషియల్ గా రిలీజ్ చేసింది. ఈ అప్ కమింగ్ మోటరోలా స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు ఏమిటో ఒక లుక్కేద్దామా.
మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో విడుదల చేయబోతున్నట్లు మోటరోలా డేట్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రత్యేకంగా అందించిన మైక్రో సైట్ టీజర్ పేజీ నుంచి ఈ వివరాలు విడుదల చేసింది. కేవలం డేట్ మాత్రమే కాదు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కీలక ఫీచర్లు కూడా మోటరోలా ఇదే పేజీ నుంచి రివీల్ చేసింది. ఈ ఫోన్ టీజర్ లో భాగంగా ఈ వివరాలు అందించినట్లు మోటోరోలా తెలిపింది.
మోటరోలా ఎడ్జ్ 70 ప్రో స్మార్ట్ ఫోన్ ను మంచి స్లీక్ డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫోన్ శాటిన్ లక్స్ ఫినిష్, ఫాబ్రిక్ ఫినిష్ మరియు మార్బుల్ ఫినిష్ తో మొత్తం మూడు స్టైల్స్ లో వస్తుంది. ఈ ఫోన్ ను 2.4 మిలియన్ కంటే అధిక AnTuTu స్కోర్ అందించే మీడియాటెక్ Dimensity 8500 Extreme చిప్ సెట్ తో లాంచ్ చేస్తుంది. అంతేకాదు, ఇందులో మరింత వేగవంతమైన 12GB LPDDR5X ర్యామ్ కూడా ఉంటుంది.
ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే, ఇందులో 50MP Sony LYT 710 మెయిన్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇది 4K 60FPS వీడియో రికార్డింగ్ మరియు లేటెస్ట్ AI కెమెరా సపోర్ట్ తో పాటు మోటోరోలా ప్రత్యేకమైన కెమెరా ఫిల్టర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను చల్లబరిచే వేపర్ కూలింగ్ ఛాంబర్ సిస్టం కూడా ఉంది.
ఐకే ఈ ఫోన్ డిస్ప్లే విభాగానికి వస్తే, ఈ ఫోన్ 6.8 ఇంచ్ బిగ్ కర్వుడ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది 1.5K రిజల్యూషన్, 144Hz వరకు రిఫ్రెష్ రేట్ మరియు 5200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణతో కూడా వస్తుంది. ఈ ఫోన్ ను కూడా మిలటరీ గ్రేడ్ డ్యూరాబిలిటీతో లాంచ్ చేస్తోంది. అంతేకాదు, IP68 అండ్ IP69 రేటింగ్ తో మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: boAt 5.1 Dolby Atmos సౌండ్ బార్ నెవర్ బిఫోర్ ప్రైస్ లో లభిస్తోంది.!
బ్యాటరీ పరంగా, ఈ ఫోన్ స్లీక్ డిజైన్ లో కూడా భారీ 6500 mAh బ్యాటరీతో లాంచ్ అవుతుంది. ఇందులో, 90W టర్బో పవర్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది. గొప్ప సౌండ్ అందించే రెండు స్పీకర్లు ఈ ఫోన్ లో ఉంటాయి. దీనికి తోడు ఈ ఫోన్ లో డాల్బీ అట్మోస్ మరియు Hi Res ఆడియో సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అవుతుంది.