Motorola Edge 70 Neo స్టన్నింగ్ ఫీచర్స్ అండ్ డిజైన్ తో ఆకట్టుకునే ధరలో లాంచ్ అయ్యింది.!
Motorola Edge 70 Neo స్టన్నింగ్ ఫీచర్స్ అండ్ డిజైన్ తో ఆకట్టుకునే ధరలో లాంచ్ అయ్యింది
Extreme AMOLED స్క్రీన్ తో పాటు Sony LYTIA 710 కెమెరా వంటి ఫీచర్స్ తో లాంచ్
Snapdragon 7s Gen 3 చిప్ సెట్ జతగా 8GB LPDDR5X ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది
Motorola Edge 70 Neo స్టన్నింగ్ ఫీచర్స్ అండ్ డిజైన్ తో ఆకట్టుకునే ధరలో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ స్లీక్ డిజైన్ అండ్ Extreme AMOLED స్క్రీన్ తో పాటు Sony LYTIA 710 కెమెరా వంటి ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం మార్కెట్ లో నడుస్తున్న చాలా మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ లకు పోటీగా మోటోరోలా ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. మోటోరోలా సరికొత్తగా విడుదల చేసిన ఈ ఫోన్ ప్రైస్, ఆఫర్స్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
Motorola Edge 70 Neo : ప్రైస్
మోటోరోలా ఈ కొత్త ఫోన్ ను కేవలం సింగల్ వేరియంట్ తో లాంచ్ చేసింది. క్లియర్ గా చెప్పాలంటే, మోటోరోలా ఎడ్జ్ 70 నియో స్మార్ట్ ఫోన్ 8GB + 128GB తో కేవలం రూ. 37,999 రూపాయల ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పైన మంచి లాంచ్ ఆఫర్లు కూడా మోటోరోలా అనౌన్స్ చేసింది.
ఆఫర్స్
ఈ స్మార్ట్ ఫోన్ పైన గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. అవేమిటంటే, ఈ స్మార్ట్ ఫోన్ పైన రూ. 3,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 34,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. డిసెంబర్ 1వ నుంచి ఈ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Motorola Edge 70 Neo : ఫీచర్స్
మోటోరోలా నియో ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ బిగ్ బ్యాటరీతో కేవలం 8.49mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానల్ సిల్క్ ఇన్స్పైర్డ్ ఫినిష్ తో ఉంటుంది. ఇందులో గొరిల్లా గ్లాస్ 7i రక్షణ మరియు 5,200 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ కలిగిన 6.8 ఇంచ్ 1.5K Extreme AMOLED స్క్రీన్ ఉంది. ఈ స్క్రీన్ గేమింగ్ అండ్ విజువల్స్ కోసం 1.5K రిజల్యూషన్ అండ్ 144Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఇది క్వాల్కమ్ Snapdragon 7s Gen 3 చిప్ సెట్ జతగా 8GB LPDDR5X ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP Sony LYTIA 710 ప్రధాన కెమెరా, 2MP మాక్రో విజన్ మరియు డెడికేటెడ్ 3 ఇన్ 1 లైట్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ లో ముందు వైపు 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్, ఆటో స్మైల్ క్యాప్చర్, ఆటో నైట్ విజన్ వంటి చాలా మోటోరోలా కెమెరా ఫీచర్స్ తో పాటు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంది.
ఈ మోటో ఫోన్ MIL-STD-810H సర్టిఫికేషన్ తో గట్టిగా ఉంటుంది. అంతేకాదు, IP 64 రేటింగ్ కలిగి మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ గా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 7,000mAh బిగ్ బ్యాటరీని 45W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జ్, 7.5W రివర్స్ ఛార్జ్ మరియు బైపాస్ ఛార్జ్ వంటి ప్రీమియం ఛార్జ్ ఫీచర్స్ తో కలిగి ఉంటుంది.