Motorola Edge 70: ప్రపంచపు అతి సన్నని ఫోన్ లాంచ్ డేట్ వచ్చేసింది.!

Updated on 09-Dec-2025
HIGHLIGHTS

ప్రపంచపు అతి సన్నని ఫోన్ Motorola Edge 70 లాంచ్ డేట్ వచ్చేసింది

ఈ ఫోన్ ను కేవలం 5.9mm స్లీక్ డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచిన కంపెనీ

ఈ రోజు ఈ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది

Motorola Edge 70 : ప్రపంచపు అతి సన్నని ఫోన్ లాంచ్ డేట్ వచ్చేసింది. మోటోరోలా ఎడ్జ్ సిరీస్ అంటేనే కొత్తదనానికి పెట్టింది పేరు. ఇప్పుడు ఈ సిరీస్ నెక్స్ట్ జనరేషన్ ఫోన్ కూడా అదే పేరును సార్థకం చేసేలా వస్తోంది. ఈ ఫోన్ ను కేవలం 5.9mm స్లీక్ డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచిన కంపెనీ, ఈ రోజు ఈ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది.

Motorola Edge 70: లాంచ్ డేట్

మోటోరోలా అప్ కమింగ్ ఫోన్ ఎడ్జ్ 70 లాంచ్ డేట్ ఈరోజు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను డిసెంబర్ 15వ తేదీన ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు మోటోరోలా అనౌన్స్ చేసింది. కంపెనీ అధికారిక సైట్ నుంచి ఈ లాంచ్ డేట్ అప్డేట్ ను అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ కీలక ఫీచర్లు కూడా రివీల్ చేసింది.

Motorola Edge 70: కీలక ఫీచర్స్

మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్ ఫోన్ డిజైన్ గురించి ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ఈ అప్ కమింగ్ ఫోన్ ను కేవలం 5.9mm మందంతో వర్డ్స్ స్లీక్ ఫోన్ గా తీసుకువస్తోంది. ఇది మనం రెగ్యులర్ గా చూస్తున్న 7.9mm లేదా 8.2mm మందం కలిగిన ఫోన్స్ తో పోలిస్తే ఈ ఫోన్ సూపర్ స్లీక్ గా ఉంటుంది. ఈ ఫీచర్ తో మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్ ఫోన్ కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని కంపెనీ టీజింగ్ చేస్తోంది.

ఈ ఫోన్ చూడగానే కళ్ళు చెదిరే డిజైన్ తో కనిపిస్తోంది. ఈ ఫోన్ ప్రస్తుతం ప్యాంటనోన్ గ్రీన్ కలర్ వేరియంట్ లో కనిపిస్తుంది. ఈ ఫోన్ ఇంత స్లీక్ డిజైన్ లో కూడా ట్రిపుల్ 50MP రియర్ కెమెరా ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ విషయాన్ని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ లో అందించిన చిప్ సెట్ వివరాలు కూడా మోటోరోలా రివీల్ చేసింది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon Gen 4 చిప్ సెట్ తో లాంచ్ చేస్తునట్లు కంపెనీ ఈ ఫోన్ ఫీచర్ రివీల్ చేసింది.

Also Read: Poco C85 5G: చవక ధరలో భారీ ఫీచర్స్ విడుదలైన పోకో కొత్త ఫోన్.!

ఈ ఫోన్ లో 1.5K రిజల్యూషన్ కలిగిన AMOLED ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఈ ఫోన్ డాల్బీ అట్మాస్ మరియు Hi-Res ఆడియో సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది. ఎందుకంటే, మోటోరోలా సాదరంగా అన్ని ఫోన్స్ లో ఈ ఫీచర్ కామన్ గా అందిస్తుంది. అందుకే, మనం ఈ ఫీచర్స్ ఈ ఫోన్ లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ ఫోన్ మరిన్ని ఫీచర్ వివరాలు కూడా మోటోరోలా త్వరలోనే రివీల్ చేస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :