Motorola Edge 70 5G complete features know before launch
Motorola Edge 70 5G స్మార్ట్ ఫోన్ రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కంటే ఒకరోజు ముందు ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ మోటోరోలా విడుదల చేసింది. ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ ఫోన్ లాంచ్ కోసం కంపెనీ అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ వివరాలు అందించింది. ఇండియా యొక్క అతి సన్నని ఫోన్ గా ఇది ఇండియాలో లాంచ్ అవుతోంది. మరి రేపు విడుదల కాబోతున్న ఈ ఫోన్ ఫీచర్స్ ఏమిటో చూద్దామా.
మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ గొప్ప డిజైన్ మరియు స్టన్నింగ్ ఫీచర్స్ తో లాంచ్ అవుతున్నట్లు ఈ ఫోన్ గురించి మోటరోలా గొప్పగా చెబుతోంది. ఎడ్జ్ 70 స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా అందించిన మైక్రో సైట్ టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ యొక్క కంప్లీట్ ఫీచర్స్ ఈరోజు వెల్లడించింది.
మోటోరోలా ఎడ్జ్ 70 ఫోన్ కేవలం 5.99 మందంతో చాలా స్లీక్ ఫోన్ గా ఉంటుంది మరియు కేవలం 159 గ్రాముల బరువుతో చాలా తేలికైన ఫోన్ గా కూడా ఉంటుంది. ఈ ఫోన్ ఎయిర్ క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ తో ఉంటుంది మరియు ప్రీమియం టెక్స్చర్ ఫినిష్ తో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ ఫోన్ 6.7 ఇంచ్ AMOLED స్క్రీన్ తో ఉంటుంది. ఈ స్క్రీన్ 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1.5K రిజల్యూషన్ మరియు గొరిల్లా గ్లాస్ 7i రక్షణ కూడా కలిగి ఉంటుంది.
ఈ మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7 Gen 4 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో మూడు 50MP కెమెరాలు కలిగిన గొప్ప రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 50MP పాంటోన్ వాలిడేటెడ్ మెయిన్ సెన్సార్, 50MP అల్ట్రా వైడ్ సెన్సార్ జతగా మరో కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ మరియు ముందు 50MP క్వాడ్ పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ 60FPS 4K వీడియో రికార్డింగ్ మరియు మోటో AI సపోర్ట్ తో గొప్ప AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: సోమవారం నుంచి Galaxy A-series స్మార్ట్ ఫోన్స్ ధర భారీగా పెరిగే అవకాశం.. ఏమిటి ఈ కొత్త కథ.!
ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది మరియు ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 68W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ మరియు 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Copilot, Perplexity, Gemini మరియు Moto Ai వంటి మల్టీ Ai ప్లాట్ ఫామ్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ హాలో UI సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16 OS తో వస్తుంది. ఈ ఫోన్ 3 సంవత్సరాల OS అప్గ్రేడ్ మరియు 4 సెక్యూరిటీ అప్‌డేట్ అందుకుంటుంది. ఈ ఫోన్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్ కూడా కలిగి ఉంటుంది.