Motorola Edge 60 Pro launched silently in India know everything
Motorola Edge 60 Pro స్మార్ట్ ఫోన్ ను చాలా సైలెంట్ గా ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ ఫోన్ 50x సూపర్ జూమ్ కలిగిన కెమెరా మరియు సరికొత్త చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది. ఈ లేటెస్ట్ మోటోరోలా స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.
మోటోరోలా ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను 30 వేల బడ్జెట్ సెగ్మెంట్ ధరలో అందించింది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ (8GB + 256GB) ను రూ. 29,999 ధరతో మరియు 12GB + 256GB వేరియంట్ ను రూ. 33,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పై రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ మరియు రూ. 1,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ ను అందించింది. ఈ ఫోన్ పాంటోన్ డాజ్లింగ్ బ్లూ, పాంటోన్ గ్రేప్ మరియు పాంటోన్ షాడో మూడు కలర్స్ లో అందించింది.
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ లేటెస్ట్ 5G చిప్ సెట్ Dimensity 8350 Extreme తో అందించింది. దీనికి జతగా 12GB LPDDR5X ఫిజికల్ ర్యామ్, ర్యామ్ బూస్ట్ మరియు 256GB (UFS4.0) ఇంటర్నల్ స్టోరేజ్ అందించింది. ఈ ఫోన్ 6.7 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ pOLED కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, HDR10+ సపోర్ట్ వంటి ఫీచర్స్ కలిగి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణతో ఉంటుంది.
ఈ మోటోరోలా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 50MP (Sony LYTIA 700C) మెయిన్, 50MP అల్ట్రా వైడ్/ మ్యాక్రో విజన్ మరియు 10Mp టెలిఫోటో సెన్సార్ లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ముందు కూడా 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ మూడు సెన్సార్లు కూడా 4K (30fps) వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటాయి మరియు AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: D2M టెక్నాలజీతో కొత్త ఫోన్లు తెస్తున్న HMD మరియు Lava కంపెనీలు.!
ఈ మోటోరోలా లేటెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ MIL-STD-810H మిలటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ సర్టిఫికెట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ IP68 మరియు IP69 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.