125W టర్బో పవర్ ఫాస్ట్ చార్జ్ 200MP కెమెరా వంటి భారీ ఫీచర్లతో వచ్చిన మోటోరోలా కొత్త ఫోన్.!

125W టర్బో పవర్ ఫాస్ట్ చార్జ్ 200MP కెమెరా వంటి భారీ ఫీచర్లతో వచ్చిన మోటోరోలా కొత్త ఫోన్.!
HIGHLIGHTS

125W టర్బో పవర్ ఫాస్ట్ చార్జ్ 200MP కెమెరా వంటి భారీ ఫీచర్లతో మోటోరోలా తన కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది

Motorola Edge 30 Ultra స్మార్ట్ ఫోన్ భారీ ఫీచర్ల సమాహారంగా ఇండియన్ మార్కెట్ లో అడుగుపెట్టింది

ఈ స్మార్ట్ ఫోన్ భారీ 200MP ట్రిపుల్ కెమెరా సెటప్ తో పాటుగా 60MP సెల్ఫీ కెమెరాతో వచ్చింది

125W టర్బో పవర్ ఫాస్ట్ చార్జ్ 200MP కెమెరా వంటి భారీ ఫీచర్లతో మోటోరోలా తన కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. అదే Motorola Edge 30 Ultra స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ అనేక భారీ ఫీచర్ల సమాహారంగా ఇండియన్ మార్కెట్ లో అడుగుపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ భారీ 200MP ట్రిపుల్ కెమెరా సెటప్ తో పాటుగా 60MP సెల్ఫీ కెమెరాతో వచ్చింది. కేవలం కెమెరా విభాగంలో మాత్రమే కాదు అన్ని విభాగాల్లో కూడా ఈ ఫోన్ ఆకట్టుకుంటోంది. అందుకే, ఈ మోటోరోలా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ గురించి వివరంగా చూద్దామా.        

Motorola Edge 30 Ultra: స్పెసిఫికేషన్స్

మోటోరోలా ఎడ్జ్ 20 అల్ట్రా  6.67 ఇంచ్ FHD + రిజల్యూషన్ గల పంచ్ హోల్ ఎండ్ లెస్ ఎడ్జ్ డిస్ప్లే తో వుంటుంది. ఈ డిస్ప్లే 144 Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR 10+ సర్టిఫైడ్ pOLED డిస్ప్లేని కలిగివుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ Qualcomm Snapdragon 8 Gen 1 ఆక్టా కోర్ పవర్ ఫుల్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు 8జిబి ర్యామ్ జతగా వస్తుంది. ఈ ఫోన్ ఇంటర్ స్టెల్లార్ బ్లాక్ మరియు స్టార్ లైట్ అనే రెండు అందమైన కలర్ అప్షన్ లలో లభిస్తుంది.

ఎడ్జ్ 20 అల్ట్రా యొక్క కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగివుంది. ఈ కెమెరా సెటప్ లో  200MP ప్రధాన కెమెరాని OIS సపోర్ట్ తో కలిగివుంది. దీనికి జతగా అల్ట్రా వైడ్ మరియు మ్యాక్రో రెండిటికి సపోర్ట్ చేసే 50MP భారీ సెన్సార్ మరియు 12MP పోర్ట్రైట్ సెన్సార్ ఉన్నాయి. ఈ కెమెరాతో 30fps లో 8K UHD వీడియోలను, 30/60fps లో 4K UHD వీడియోలను చిత్రీకరించవచ్చు. ముందు భాగంలో కూడా భారీ 60MP సెల్ఫీ కెమెరాని ఈ ఫోన్ లో అందించింది.

మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా లో 125W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,610 mAh బ్యాటరీని అందించింది. ఇక ఇతర ఫీచర్ల విషయాన్ని వస్తే, ఈ ఫోన్ లో యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ కలిగిన 3D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 వుంది. ఈ ఫోన్ IP52 వాటర్ ప్రొటెక్షన్ సర్టిఫికేషన్ తో వస్తుంది మరియు ఆన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కూడా కలిగివుంది.

Motorola Edge 30 Ultra: Price

మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్ 8జిబి మరియు 128జిబి స్టోరేజ్ తో రూ.54,999 రూపాయల ప్రారంభధరతో ప్రకటించబడింది. ఈ ఫోన్ Flipkart బిగ్ బిలియన్ డేస్ నుండి సాల్ అవుతుంది మరియు ఈ ఫోన్ పైన మరిన్ని సేల్ ఆఫర్లను కూడా అందించవచ్చు. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo