Motorola Edge 20 ఫస్ట్ సేల్: బడ్జెట్ ధరలో 108ఎంపి కెమెరా 5G ఫోన్

Updated on 23-Aug-2021
HIGHLIGHTS

మోటోరోలా ఎడ్జ్ 20 ఫస్ట్ సేల్

108MP హై రిజల్యూషన్ ట్రిపుల్ కెమెరా

స్నాప్ డ్రాగన్ 778G 5G ప్రోసెసర్ తో వచ్చిన మొదటి ఫోను

మోటోరోలా లేటెస్ట్ గా విడుదల చేసిన మోటోరోలా ఎడ్జ్ 20 ఫస్ట్ సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. మోటోరోలా ఎడ్జ్ 20 అత్యంత సన్నని 5G మరియు స్నాప్ డ్రాగన్ 778G 5G ప్రోసెసర్ తో వచ్చిన మొదటి ఫోనుగా నిలుస్తుంది. ఈ మోటో స్మార్ట్ ఫోన్ 108MP హై రిజల్యూషన్ ట్రిపుల్ కెమెరా మరియు ఇంకా చాలా ప్రీమియం ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. Flipart నుండి ఈ ఫోన్ ఫస్ట్ సేల్ పైన మంచి ఆఫర్లను కూడా అందించింది. 

Motorola Edge 20: ప్రైస్

మోటోరోలా ఎడ్జ్ 20 ఫోన్ 8జిబి మరియు 128జిబి స్టోరేజ్ తో రూ.29,999 రూపాయల ధరతో ప్రకటించబడింది. ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ ఆగష్టు 24 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుంది. Check Offers Here

Motorola Edge 20: స్పెసిఫికేషన్స్

మోటోరోలా ఎడ్జ్ 20 స్మార్ట్‌ఫోన్‌ 6.7 ఇంచ్ FHD + రిజల్యూషన్ గల పంచ్ హోల్ డిస్ప్లే తో వుంటుంది. ఈ డిస్ప్లే 144 Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR 10+ సర్టిఫైడ్ AMOLED డిస్ప్లేని సకల`కలిగివుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ Snapdragon 778 ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు ఈ ప్రోసెసర్ తో వచ్చిన మొట్టమొదటి ఫోన్ గా నిలిచింది. ఈ ఫోన్ ఫ్రోస్టెడ్ ఎమిరాల్డ్ మరియు ఫ్రోస్టెడ్ పెర్ల్    అనే రెండు అందమైన కలర్ అప్షన్ లలో లభిస్తుంది.

ఇక మోటోరోలా ఎడ్జ్ 20 యొక్క కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగివుంది. కానీ, ఇది క్వాడ్ కెమేరా పనులను చెయ్యగల శక్తితో వుంటుంది. ఇందులో 108MP ప్రధాన కెమెరా, అల్ట్రా వైడ్ మరియు మ్యాక్రో రెండిటికి సపోర్ట్ చేసే 16ఎంపి సెన్సార్ మరియు 8ఎంపి టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ కెమేరాతో 30X వరకూ డిజిటల్ జూమ్ చెయ్యవచ్చని కంపెని తెలిపింది. ముందుభాగంలో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. మోటోరోలా ఎడ్జ్ 20 లో 30W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,000 mAh బ్యాటరీ ఉంది మరియు టైప్ C ఛార్జర్ తో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :